ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చదవడానికి టైమ్ లేదు.. అలా చేయాలంటూ పరీక్షలో ఓ చిన్నారి విజ్ఞప్తి.. ఏం రాశాడో చూస్తే నవ్వకుండా ఉండలేం..

ABN, Publish Date - Aug 28 , 2024 | 06:30 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగానికి చెందిన పిల్లలకు చిన్న వయసులోనే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. తమ తెలివితేటలతో వారు టీచర్లనే ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో పలు ప్రశ్నలకు వారు తమదైన శైలిలో రాస్తున్న జవాబులు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి.

Funny Viral Answer Sheet

ప్రస్తుత సోషల్ మీడియా యుగానికి చెందిన పిల్లలకు (Child) చిన్న వయసులోనే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. తమ తెలివితేటలతో వారు టీచర్లనే ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో పలు ప్రశ్నలకు వారు తమదైన శైలిలో రాస్తున్న జవాబులు (Viral Answer Sheet) చాలా మందికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థి రాసిన జవాబు చూస్తు నివ్వెరపోవాల్సిందే. ఆ జవాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ``చదువుకోవడం ఎందుకు ముఖ్యం`` అనే ప్రశ్నకు ఓ పిల్లవాడు తనదైన శైలిలో రాసిన జవాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).


creator03319 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ జవాబు పత్రం షేర్ అయింది. ``చదువుకోవడం ఎందుకు ముఖ్యం`` అనే ప్రశ్నకు జవాబుగా ఓ విద్యార్థి.. ``చదువుకోవడం చాలా ముఖ్యం. కానీ మాకు చదువుకోవడానికి సమయం లేదు. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు. అందులో 52 ఆదివారాలు, 50 వేసవి సెలవులు. రోజూ 8 గంటలు నిద్రపోవాలి, అంటే 122 రోజులు పోయాయి. రోజులో ఒక గంట ఆడుకోవడానికి, 2 గంటలు తినడానికి కేటాయిస్తే 45 రోజులు పోతాయి. 1 గంట మాట్లాడుకుంటే.. 15 రోజులు. పండుగల కోసం 40 రోజులు. పరీక్షల కోసం 30 రోజులు. అనారోగ్యం కారణంగా మూడు రోజులు. సినిమాలు, ఫంక్షన్ల కోసం 2 రెండు రోజులు. ఇవన్నీ పోగా సవంత్సరంలో ఒకే ఒక్క రోజు చదువుకోవడానికి మిగిలి ఉంది. అది నా పుట్టినరోజు. కాబట్టి చదువుకోవడం కోసం సంవత్సరంలో మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను`` అంటూ ఆ కుర్రాడు రాశాడు.


ఆ కుర్రాడు రాసిన తీరుకు టీచర్ షాకయ్యారు. పదికి పది మార్కులు వేసి ఆ జవాబు పత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ఇది అక్షర సత్యం``, ``ఆ టీచర్ కూడా అదే ఫీలవుతున్నట్టున్నారు``, ``నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను``, ``డేంజరస్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పోలీసులా? మజాకానా? ఇద్దరు కుర్రాళ్లకు ఉదయాన్నే జైపూర్ పోలీసులు ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటంటే..


Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..


Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..


Optical Illusion: మీ కళ్లకు, బ్రెయిన్‌కు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న మరో నలుగురిని కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 06:30 PM

Advertising
Advertising