Viral: భర్త కోసం తెల్లవారుజామున తానేంచేసేది చెప్పిన వివాహిత.. నెటిజన్లకు షాక్!
ABN, Publish Date - Jun 17 , 2024 | 06:44 PM
నెట్టింట ఆసక్తికరమైన కంటెంట్‌కు కొదవే లేదు. కొందరు తమ వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇలాగే ఓ మహిళ తన భర్త కోసం ప్రతి రోజూ చేసేదేంటో చెబుతూ చేసిన టిక్‌టాక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ఆసక్తికరమైన కంటెంట్‌కు కొదవే లేదు. కొందరు తమ వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇలాగే ఓ మహిళ తన భర్త కోసం ప్రతి రోజూ చేసేదేంటో చెబుతూ చేసిన టిక్‌టాక్ వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది.
అమెరికాకు చెందిన క్రిస్టీన్ లీటీ తన దిన చర్య ఎలా ఉంటుందో చెబుతూ ఓ వీడియో చేసింది. తాను ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తానని చెప్పింది. భర్త పిల్లల కోసం టిఫిన్, లంచ్ రెడీ చేస్తానని వివరించింది. తమకు పెళ్లై 13 ఏళ్ల గడిచిందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తన భర్త ఉద్యోగం రీత్యా మూడు నాలుగు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండేవాడని తెలిపింది. ఈ మధ్య కాలంలో ఓ చోట హెవీ వెహికిల్ డ్రైవర్ గా చేరడంతో కుటుంబంతో ఎక్కువ సేపు గడుపుతున్నా ఉదయాన్నే వెళ్లాల్సి రావడంతో తాను ఇలా చేస్తున్నానని చెప్పింది (Wife Shares Her 4AM To 7AM Daily Routine).
Air India: విమానంలో ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్.. ఎయిర్ ఇండియా ప్యాసెంజర్‌కు భారీ షాక్!
కుటుంబం కోసం ఆమె పడుతున్న తాపత్రయం చూసి అనేక మంది ప్రశంసిస్తే కొంతమంది మాత్రం విమర్శించారు. బయట రెస్టారెంట్ల వంటివి అనేకం అందుబాటులో ఉన్నా అంత పొద్దున్నే లేవడం సబబు కాదని కొందరు విమర్శించారు. ఈకాలంలో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేకపోతున్నామని కొందరు అన్నారు. అయితే, తన కుటుంబం కోసం కష్టపడటంలో తనకేమాత్రం ఇబ్బందిగా లేదని, తామిద్దరం ఓ జట్టులాగా ఒకరికోసం ఒకరు కష్టపడుతున్నామని చెప్పుకొచ్చింది. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Jun 17 , 2024 | 06:53 PM