ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్న యువతిని టీవీలో చూసి గుర్తుపట్టిన బాస్.. ఆ తరువాత..

ABN, Publish Date - Apr 09 , 2024 | 06:21 PM

స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్ చూసేందుకు ఓ యువతి ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ కాస్తంత ముందుగా ఆఫీసు నుంచి వెళ్లిపోయింది. కానీ ఆమెను టీవీలో చూసిన బాస్ గుర్తుపట్టడంతో అడ్డంగా బుక్కైపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ అబద్ధం చెప్పి ఆఫీసు నుంచి ముందుగా వెళ్లిపోయిన ఓ యువతి బాస్‌కు అడ్డంగా దొరికిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందీ చెబుతూ ఆమె నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఐపీఎల్ సీజన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అనేక మంది టీవీల్లో మ్యాచు‌లు చూసి ఆనందిస్తుంటే కొందరు స్టేడియాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు వీరాభిమాని అయిన ఓ యువతి కూడా స్టేడియంకు వెళ్లి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ చూసింది. ఇందుకు కోసం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉందని చెప్పి బాస్ నుంచి సెలవు తీసుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఆసాంతం ఎంజాయ్ చేసింది.

అయితే, ఒకానొక సమయంలో స్టేడియంలోని కెమెరా ఆమె పైకి ఫోకస్ కావడంతో టీవీలో కనిపించింది. ఆమె కనిపించింది క్షణకాలమే. అయితే అప్పటికే టీవీ చూస్తున్న బాస్ తెరపై ఆమె కనిపించగానే గుర్తుపట్టేశాడు. అంతకుముందు రోజు ఆమె లీవ్ ఎందుకు తీసుకుందో బాస్‌కు అర్థమైపోయింది (Woman Bunks Office Due To Emergency Boss Spots Her Watching IPL Match).

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..


ఆ తరువాత వరుస మెసేజీలతో బాస్ ఆమెకు షాకిచ్చాడు. నువ్వు ఆర్‌సీబీ ఫ్యాన్‌ ఆ అంటూ హఠాత్తుగా మెసేజ్ పెట్టాడు. ఇలా ఎందుకు ప్రశ్నించాడో అర్థంకాక ఆమె అవునని సమాధానం ఇచ్చింది. అయితే, నువ్వు నిన్న బాగా నిరాశ చెంది ఉంటావు అంటూ మరో మెసేజ్ పెట్టాడు. నిన్న 16.3 ఓవర్లో నువ్వు టీవీలో కనిపించావు. సో.. నిన్న త్వరగా వెళ్లిపోయింది ఇందుకేనా అంటూ ఓ స్మైలీ ఎమోజీ కూడా జతచేశాడు. బాస్‌కు తన గురించి తెలిసిపోయిందని, అయితే ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడని అర్థమయ్యాక ఊపిరిపీల్చుకున్న యువతి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. దీంతో, నెట్టింట పెద్ద స్పందన వచ్చింది. ఆమె బాస్ చాలా మంచివాడని కొందరు అన్నారు. తమ కంపెనీలో అయితే జీతం కట్ చేసేవారని కొందరు చెప్పుకొచ్చారు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 09 , 2024 | 06:29 PM

Advertising
Advertising