Viral: బ్రేకప్ చెప్పిన బాయ్‌ఫ్రెండ్.. 2 వారాల తరువాత యువతికి అసలు విషయం తెలిసి..
ABN, Publish Date - Apr 29 , 2024 | 07:45 PM
బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెబితే సరేనన్న ఓ యువతి ఆ తరువాత రెండు వారాలకు అసలు విషయం తెలిసి మండిపోయింది. అతడు జన్మలో మర్చిపోలేని విధంగా ప్రతీకారం తీర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెబితే సరేనన్న ఓ యువతి ఆ తరువాత రెండు వారాలకు అసలు విషయం తెలిసి మండిపోయింది. అతడు జన్మలో మర్చిపోలేని విధంగా ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
తన అనుభవాన్ని ఆ యువతి పాడ్‌కాస్ట్‌లో వివరించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం యువతి బాయ్‌ఫ్రెండ్ మిలిటరీలో పనిచేస్తాడు. ఓ రోజు అతడు ఆమెకు కాల్ చేసి తమ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు తెలిపాడు. అకస్మాత్తుగా అతడు ఎందుకు బ్రేకప్ చెప్పాడో ఆమెకు అర్థంకాలేదు. ఆమెపై ఇష్టం తగ్గినట్టు అతడు ఏనాడు చెప్పలేదు. అయితే, అతడిని బలవంతం పెట్టొద్దనుకున్న యువతి అతడికి దూరమైంది. ఆ విషయం అక్కడితో మర్చిపోయింది.
Viral: నెలకు రూ.కోటి చొప్పున 30 ఏళ్ల పాటు కనకవర్షం.. మేస్త్రీకి బంపర్ జాక్‌పాట్!
అయితే, బ్రేకప్‌కు ముందే ఆ జంట స్పెయిన్‌లో సరదాగా పర్యటిద్దామని ప్లాన్ వేసుకున్నారు. ఇందు కోసం హోటళ్లు, విమానాల టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ తరువాత రెండు వారాలకు మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆమెకు మళ్లీ ఫోన్ చేసి నాటి టూర్ గురించి గుర్తు చేశారు. స్పెయిన్‌కు తన తల్లిని తీసుకెళ్లాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమె టిక్కెట్ల డబ్బు తిరిగి ఇచ్చేస్తానని కూడా అన్నాడు. ఇందులో కూడా ఆమెకు సందేహించాల్సినది ఏమీ లేకపోవడంతో ఆమె ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఆమె ఇంటికి టూర్ కంపెనీ నుంచి టిక్కెట్లు వచ్చాయి. వాటిల్లో మాజీ బాయ్ ఫ్రెండ్ తల్లి పేరుకు బదులు మరో యువతి పేరు ఉండటం చూసిన యువతికి డౌట్ మొదలైంది. ఆ తరువాత తీగ లాగితే డొంక అంతా కదిలింది (Woman Cancels Non-refundable Tickets To Spain As Revenge Against Cheating Boyfriend).
బ్రేకప్ చెప్పడానికి కొన్ని నెలల ముందు నుంచే అతడు మరో యువతికి దగ్గరయ్యాడని, ఆ విషయాన్ని దాచి పెట్టి అతడు సడెన్‌గా బ్రేకప్ చెప్పాడని తెలుసుకున్నాక ఆమె భగ్గుమంది. అతడు ప్రస్తుతం ఆమెతోనే టూర్లో ఉన్నాడని గుర్తించిన వెంటనే టూర్ కంపెనీ వెబ్సైట్లో అతడి ఐడీతో లాగిన్ అయ్యి ఆ హోటల్, విమాన టిక్కెట్లను క్యాన్సిల్ చేసేసింది. టిక్కెట్లు నాన్ రీఫండబుల్ కావడంతో అతడు అక్కడ చిక్కుపడిపోవడమే కాకుండా చివరకు భారీగా డబ్బు చెల్లించి మళ్లీ హోటళ్లు, విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. పాడ్ కాస్ట్లో ఆమె చెప్పిందంతా విన్న శ్రోతలు తగిన శాస్తి చేశావంటూ యువతిపై ప్రశంసలు కురిపించారు.
Updated Date - Apr 29 , 2024 | 08:46 PM