Viral: రైళ్లల్లో రద్దీపై టీటీఈకి యువతి ఫిర్యాదు.. ఆయన రిప్లై ఏంటో తెలిస్తే..
ABN, Publish Date - Apr 13 , 2024 | 04:13 PM
రైల్లో రద్దీ ఎక్కువగా ఉందని ఓ మహిళ అంటే..టీటీఈ ఏమో తాను అదనపు రైళ్లు నడిపించేందుకు రైల్వే మంత్రిని కానంటూ జవాబిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లల్లో రద్దీతో ప్రయాణికులు నానా అవస్థలూ పడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాంటి వీడియో ఒకటి మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైళ్లల్లో రద్దీపై యువతి ఫిర్యాదుకు టీటీటీ బదులిచ్చిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓఖా-కాన్పూర్ రైల్లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: రోబోతో ఏకధాటిగా 20 గంటల పాటు పనిచేయిస్తే.. షాకింగ్ వీడియో..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్వే ప్లాట్‌ఫాంపై నిలబడ్డ ఓ యువతి రైల్లో రద్దీని చూసి హడలిపోయింది. కనీసం నడిచేందుకు కూడా స్థలం లేని విధంగా బోగీలన్నీ కిక్కిరిసిపోయయి. ఇది చూసిన యవతికి తాను రైలు ప్రయాణం ఎలా చేయాలో అర్థం కాలేదు. రైల్లో తన భద్రతపై కూడా ఆమెకు సందేహాలు కలిగాయి.
ఈలోపు రైల్లోంచి దిగుతున్న టీటీఈని చూసి ఆమె ప్రశ్నల పరంపర సంధించింది. ఇలాంటి రైళ్లల్లో మహిళలు ధైర్యంగా ఎలా ప్రయాణించగలరని పేర్కొంది. దీనికి టీటీఈ మాత్రం తాను చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆమెను చూసి చేతులు జోడించి..‘‘ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను రైల్వే మంత్రిని కాదు కాబట్టి అదనపు రైళ్లను నడపలేను’’ అని అన్నారు. దీంతో, షాకైన యువతి కూడా అసంతృప్తి వెళ్లగక్కింది. ‘‘మీరు మీ భద్రత గురించి చూసుకుంటున్నారు గానీ మహిళల భద్రత మాత్రం పట్టించుకోవట్లేదు’’ అని వ్యాఖ్యానించింది (Woman Complains About Uncomfortable Overcrowded Train).
Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..
ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు టీటీఈ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికురాలి ఆవేదన అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించి ఉండాల్సిందని అన్నారు. రద్దీగా ఉన్న కోచ్‌లో టీటీటీ యువతికి సీటు ఎక్కడి నుంచి కేటాయించగలడని మరికొందరు ప్రశ్నించారు. హాస్యాస్పదన డిమాండ్లను నెరవేర్చడం కుదరదని అన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 13 , 2024 | 04:19 PM