Viral Video: ఇంక వీళ్లు మారరా..? మెట్రో రైలులో యువతి డ్యాన్స్ వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..
ABN, Publish Date - Sep 29 , 2024 | 11:16 AM
``స్త్రీ-2`` చిత్రంలో తమన్నా పాపులర్ సాంగ్ ``ఆజ్ కి రాత్``కు ఓ యువతి మెట్రో రైలులో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ``పబ్లిక్ డిమాండ్`` మేరకు ఈ డ్యాన్స్ ప్రదర్శన జరిగినట్టు కామెంట్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వైరల్ కార్యక్రమాలకు మైట్రో రైళ్లు (Metro Trains) వేదికలుగా మారాయి. రీల్స్ (Reels) కోసం డ్యాన్స్‌లు వేసే ప్రయాణికుల నుంచి స్టంట్లు చేసే వారు, గొడవలు పడే వారు అందరూ ఈ ప్రజా రవాణా వ్యవస్థను తమకు నచ్చినట్టు వాడుకుంటున్నారు (Dance in Metro). ఆయా ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి తమన్నా పాటకు తనదైన శైలిలో చిందులేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
sahelirudra అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ``స్త్రీ-2`` చిత్రంలో తమన్నా పాపులర్ సాంగ్ ``ఆజ్ కి రాత్`` (Aaj Ki Raat)కు ఓ యువతి మెట్రో రైలులో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ``పబ్లిక్ డిమాండ్`` మేరకు ఈ డ్యాన్స్ ప్రదర్శన జరిగినట్టు కామెంట్ చేసింది. ఆ వీడియోలోని ఇతర ప్రయాణీకులు ఆమె ప్రదర్శనను చూస్తున్నారు. కొందరు వినోదభరితంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు. మరికొందరు బహిరంగ ప్రదేశంలో ఊహించని ప్రదర్శనతో విసుగు చెందినట్టు ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
మూడు రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిది లక్షల వీక్షణలను సంపాదించింది. దాదాపు 29 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``నృత్య ప్రదర్శనకు ఇది సరైన ప్రదేశం కాదు``, ``అక్కడున్న అందరూ మీ ప్రదర్శనను ఎంజాయ్ చేసే స్థితిలో లేరు``, ``ఆమె జీవితాన్ని ఆనందంగా జీవిస్తోంది. డ్యాన్స్ చేస్తే తప్పేంటి``, ``నేను గనుక ఆ కోచ్‌లో ఉంటే.. ఆమె డ్యాన్స్ ప్రదర్శన కారణంగా కచ్చితంగా ఇబ్బంది పడతాను``, ``ఇది ప్రదర్శన వేదిక కాదు, ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: 17 ఏళ్ల క్రితం బార్ బిల్లు వైరల్.. 2007లో ఢిల్లీ బార్‌లో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చైందంటే..
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 29 , 2024 | 11:16 AM