ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: రాఖీ పండుగకు సెలవు అడిగితే ఉన్న ఉద్యోగం ఊడింది.. కంపెనీ చెప్పిన కారణం ఏంటంటే..

ABN, Publish Date - Aug 16 , 2024 | 08:56 AM

ఎవరైనా ఉద్యోగి సెలవు అడిగితే యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? వీలైతే సెలవు ఇస్తుంది.. లేకపోతే కదరదు అని చెబుతుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ సెలవు అడిగిన ఉద్యోగినిని ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేసింది. ఇరవై రోజులు టైమిచ్చి ఆపై కంపెనీకి రావాల్సిన అవసరం లేదని టెర్మినేషన్ లెటర్ పంపింది.

Boss fired employee from her job over the Raksha Bandhan leave

ఎవరైనా ఉద్యోగి సెలవు (Leave) అడిగితే యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? వీలైతే సెలవు ఇస్తుంది.. లేకపోతే కదరదు అని చెబుతుంది. కానీ, పంజాబ్‌ (Punjab)కు చెందిన ఓ కంపెనీ సెలవు అడిగిన ఉద్యోగినిని ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేసింది. ఇరవై రోజులు టైమిచ్చి ఆపై కంపెనీకి రావాల్సిన అవసరం లేదని టెర్మినేషన్ (Termination) లెటర్ పంపింది. దీంతో ఆ మహిళ షాకైంది. తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీపై మండిపడుతున్నారు (Viral News).


పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న బి9 సొల్యూషన్స్ (B9 Solutions) సంస్థలో బబిన అనే మహిళ హెచ్‌ఆర్ మేనేజర్‌గా (HR Manager) పని చేస్తున్నారు. ఇటీవల ఆ సంస్థ యాజమాన్యం ఓ సర్క్యులర్ విడుదల చేసింది. వరుస సెలవులు రావడంతో సోమవారం రక్షాబంధన్ (Raksha Bandhan) అయినా అందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ రోజు సెలవు పెట్టినా, ఆలస్యంగా వచ్చినా ఏడు రోజుల జీతం కట్ చేస్తామని హెచ్చరించింది. ఈ సర్క్యులర్‌పై హెచ్‌ఆర్ అయిన బబిన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక్క రోజు సెలవుకు వారం రోజుల జీతం కట్ చేయడం అన్యాయమని, దీనికి తాను ఒప్పుకోబోనని వాదించింది. బబినపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాస్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాడు.


ఉద్యోగులందరి కోసం పోరాడిన తాను ఉద్యోగం కోల్పోవడంతో బబిన షాకైంది. తనకెదురైన అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుండడంతో యాజమాన్యం వివరణ ఇచ్చింది. బబిన ప్రవర్తన సరిగా లేదంటూ పేర్కొంది. బబిన ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ లెటర్ అందుకుందని తెలిపింది. ఆఫీసులో ఫోన్ ఎక్కువగా వాడడం, వర్క్ టైంలో ఆన్ లైన్ కోర్సులు చేయడం, ఆఫీసు పని పక్కన పెట్టి కూతురు హోంవర్క్ చేస్తూ కూర్చోవడం వంటి పనులు చేస్తున్న బబినను చాలా సార్లు మందలించామని, అయినా ఆమె తీరు మార్చుకోకుండా ఉద్యోగులను రెచ్చగొడుతోందని కంపెనీ ఆరోపణలు చేసింది.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ మెదడుకు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2024 | 08:56 AM

Advertising
Advertising
<