Viral: సడెన్‌గా రైలు కింద పడ్డ మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే..
ABN, Publish Date - Aug 20 , 2024 | 04:08 PM
అకస్మాత్తుగా రైలు కింద పడ్డ ఓ యువతి చిన్న గాయమైనా లేకుండా ప్రాణాలతో బయటపడిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇదేలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవితం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒత్తిడి, ఆందోళన, పనిప్రదేశంలో సమస్యలు, లక్ష్యాలు చేరుకోలేక అవస్థలు, పోటీ వెరసి యువత జీవితం ఒత్తిడితో నిండిపోతోంది. కొందరిని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా వేధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేని అనేక మంది చివరకు తమ జీవితాల్ని చాలిస్తు్న్న విషాదకర ఉదంతాలు నిత్యం వార్తల్లోకెక్కుతున్నాయి. అయితే, తాజాగా ఓ యువతి బలవన్మరణానికి ప్రయత్నించి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: దేవుడా! ఈ కార్పొరేట్ ఉద్యోగి దుస్థితి చూడండి.. నదిలో కూర్చుని..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి అకస్మాత్తుగా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రైలు ప్లాట్‌ఫార్మ్‌ను సమీపిస్తున్న సమయంలో ఆమె సడెన్‌గా పట్టాలపై దూకేసింది. వేగంగా వస్తు్న్న రైలు ఆమె మీద నుంచి వెళ్లిపోయింది. అప్పటికే లోకోపైలట్ రైలుకు బ్రేక్ వేసి ఉండటంతో రైలు ఆ మరుక్షణమే ఆగిపోయింది. ఇక రైలు ఆగిన వెంటనే యువతి రైలు కింద నుంచి లేచి బయటకు వచ్చింది. ఏమీ జరగనట్టు మళ్లీ ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది. రైలు మీద నుంచి వెళ్లినా ఆమెకు ఏం జరగకపోవడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది (woman jumps infront of train escapes unhurt in viral video).
వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. ఇదెలా సాధ్యమైందని నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజమా కనికట్టా అర్థం కావట్లదేని అన్నారు. ఘటన ఎక్కడి జరిగిందీ తెలియకపోవడం కూడా నెటిజన్లలో పలు సందేహాలు లేవనెత్తింది. కొందరు మాత్రం యువతి చర్యపై విమర్శలు గుప్పించారు. తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం జరిగిందని కొందరు కామెంట్ చేశారు. జీవితంపై ఆశతో ఉంటే మంచి రోజులు కచ్చితంగా వస్తాయని కొందరు అభిప్రాయపడ్డారు. నేటి యువతలో కొందరు ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమవుతున్నారని కొందరు వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
Updated Date - Aug 20 , 2024 | 04:14 PM