Viral Video: ఇలాంటి వాళ్ల వల్ల మరో మహమ్మారి వస్తుంది.. వింత బిర్యానీ చేసిన మహిళపై నెటిజన్ల ఆగ్రహం..
ABN, Publish Date - Nov 24 , 2024 | 08:52 AM
పండగ వచ్చినా, ఫంక్షన్ అయినా, రెస్టారెంట్‌కు వెళ్లినా తినాల్సిన ఫుడ్స్ జాబితాలో బిర్యానీ తప్పకుండా ఉంటుంది. అలాంటి బిర్యానీని రకరకాలుగా తయారు చేస్తారు. హైదరాబాద్ మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఇలా రకరకాలుగా బిర్యానీలను తయారు చేస్తారు.
మనదేశంలో బిర్యానీ (Biryani)ని కొన్ని కోట్ల మంది ఇష్టపడతారు. ఎంతో మందికి బిర్యానీ అనేది ఫేవరెట్ ఫుడ్. వెజ్, నాన్-వెజ్ అనే తేడా లేకుండా చాలా మంది బిర్యానీని ఆస్వాదిస్తారు. పండగ వచ్చినా, ఫంక్షన్ అయినా, రెస్టారెంట్‌కు వెళ్లినా తినాల్సిన ఫుడ్స్ జాబితాలో బిర్యానీ తప్పకుండా ఉంటుంది. అలాంటి బిర్యానీని రకరకాలుగా తయారు చేస్తారు. హైదరాబాద్ మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఇలా రకరకాలుగా బిర్యానీలను తయారు చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా పార్లే-జి బిస్కెట్ల (Parle-G biscuits)తో కూడా బిర్యానీ చేస్తారని మీకు తెలుసా? (Viral Video)
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలో మహిళ బిర్యానీతో పాటు పార్లే-జి బిస్కెట్లను కూడా కలిపి వడ్డిస్తోంది. creamycreationsbyhkr అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ ఓ బిర్యానీ పాత్ర ముందు నిల్చుని ఉంది. ఆ పాత్రలో బిర్యానీతో పాటు పార్లే జీ బిస్కెట్లు కూడా కనిపిస్తున్నాయి. మంచి మసాలాలతో ఈ బిర్యానీ చేశానని ఆ మహిళ చెబుతోంది. తన వెనుక కనిపించే పిల్లలు తన విద్యార్థులని, బిర్యానీ తినాలని వారు కోరినందునే ఈ స్పెషల్ బిర్యానీ తయారు చేశానని తెలిపింది.
ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు హీనా కౌసర్. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ``ఇలాంటి వారి వల్లే కరోనా వంటి మహమ్మారులు వస్తాయి``, ``ఈమెపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి``, ``దయచేసి బిర్యానీతో జోక్ చేయకండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ దృష్టికి పరీక్ష.. ఈ గుహలో దాక్కున్న కుక్కను 5 సెకెన్లలో పట్టుకోండి..
Viral Video: వీడియో కోసం ఇదేం పని.. నూతన వధువు తీరు చూస్తే కోపం రాక మానదు.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 24 , 2024 | 08:52 AM