Viral Video: ఏవమ్మా.. ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా? రోటీ ఎక్కడ చేస్తోందో చూడండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన గోయెంకా..
ABN, Publish Date - Oct 23 , 2024 | 09:09 AM
సాధారణ వ్యక్తులే కాదు.. నిత్యం ఎంతో బిజీగా ఉండే పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో కొంత సమయం సోషల్ మీడియా కోసం కేటాయిస్తారు. తమకు ఆసక్తికరంగా అనిపించిన లేదా ఫన్నీగా ఉండి నవ్వు తెప్పించిన వీడియోలను తమ ఫాలోవర్లతో పంచుకుంటారు.
సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. సాధారణ వ్యక్తులే కాదు.. నిత్యం ఎంతో బిజీగా ఉండే పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో కొంత సమయం సోషల్ మీడియా కోసం కేటాయిస్తారు. తమకు ఆసక్తికరంగా అనిపించిన లేదా ఫన్నీగా ఉండి నవ్వు తెప్పించిన వీడియోలను తమ ఫాలోవర్లతో పంచుకుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో చూసిన వారందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఓ మహిళ వెరైటీగా రోటీ చేస్తున్న వీడియో చాలా మందిని ఆకట్టుకుని నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో,, ఒక మహిళ, పురుషుడు కలిసి రోటీలు (Rotis) తయారు చేస్తున్నారు. అయితే ఆ మహిళ రోటీలను చెక్క బల్లపై కాకుండా తన భర్త గుండుపై వేసి వత్తుతోంది. ఆ మహిళ చాలా సాఫీగా గుండుపై రోటీని వత్తడం ఆ వీడియోలో కనబడుతోంది. ముందుగా ఆ వ్యక్తి గుండుపై కాస్త మైదా పిండి వేసి దానిపై రోటీ పెట్టి కర్రతో వత్తేస్తోంది. ఆ రోటీని ఆ వ్యక్తి పెనంపై వేసి కాల్చుతున్నాడు. వారి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో హర్ష్ గోయెంకా దృష్టికి రావడంతో ఆయన ఆ వీడియోను రీ-ట్వీట్ చేశారు. ``మీ డిన్నర్ రెడీ అవుతోంది`` అంటూ కామెంట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 73 వేల మందికి పైగా వీక్షించి తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ప్రతి ఇంటికి ఓ గుండు అవసరం కావచ్చు``, ``ఈ వీడియో చూసిన తర్వాత నా ఆకలి తగ్గింది``, ``ఇది చూడగానే నాకు 3 ఇడియట్స్ చిత్రం గుర్తుకు వచ్చింది``, ``చివరకు మగవాడి గుండు కూడా ఎలాగోలా ఉపయోగపడుతోంది``, ``ఇదెక్కడి క్రియేటివిటీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీరు ఎంత వేగంగా ఆలోచించగలరు?.. ఈ ఫొటోలో తప్పును 4 సెకెన్లలో పట్టుకోండి..
Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Oct 23 , 2024 | 09:09 AM