Viral Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడ్డాం.. పుచ్చకాయ నుంచి గింజలను ఎంత సులభంగా తీసేసిందో చూడండి..!
ABN, Publish Date - Jun 23 , 2024 | 10:18 AM
వేసవి కాలంలో పుచ్చకాయలను తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఎండ వేడిలో శరీరాన్ని హైడ్రేట్ చేసుకునేందుకు పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పుచ్చకాయ తినేటపుడు అందులోని గింజలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటిని తీసుకుని తినడం కాస్త కష్టమైన పనే.
వేసవి కాలంలో పుచ్చకాయలను (Watermelon) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఎండ వేడిలో శరీరాన్ని హైడ్రేట్ చేసుకునేందుకు పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పుచ్చకాయ తినేటపుడు అందులోని గింజలు (Watermelon seeds) చాలా ఇబ్బంది పెడతాయి. వాటిని తీసుకుని తినడం కాస్త కష్టమైన పనే. ఆ సమస్యను ఓ మహిళ చాలా సులభంగా పరిష్కరించేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).
arvind_tinu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ పుచ్చకాయను చాకుతో కోస్తోంది. ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలో ఉన్న గింజలను చేత్తో తీసేందుకు ప్రయత్నించింది. అది వీలు కాకపోవడంతో ముందుగా పుచ్చకాయ ముక్కలను కోసి వాటిని ఓ పాత్రలో వేసింది. ఆ పాత్రపై ఓ ప్లేట్ ఉంచి పైకి, కిందకు ఊపింది. దీంతో పుచ్చకాయలోని గింజలన్నీ వేరుగా పడిపోయాయి. దీంతో పుచ్చకాయలను వేరే చేసి ఆ మహిళ తినేసింది.
ఈ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది నిజం కాదు. మోసం``, ``అలా షేక్ చేస్తే పుచ్చకాయ నుంచి నీరు అంతా బయటకు పోతుంది``, ``ఇది నిజం కాదు.. ఎడిట్ చేసిన వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2024 | 10:19 AM