ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Zomato Order: జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. తిన్న తర్వాత ఊహించని పరిణామం

ABN, Publish Date - Apr 01 , 2024 | 09:54 PM

ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి. అయితే.. వీటి వినియోగం ఎంతలా పెరిగిందో, ఆహార నాణ్యతపై కూడా అన్నే ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల (Food Delivery Apps) వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి. అయితే.. వీటి వినియోగం ఎంతలా పెరిగిందో, ఆహార నాణ్యతపై కూడా అన్నే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది తమ ఆహారంలో పురుగులు వచ్చాయనో లేక నాసికరమైన ఫుడ్ అందించారనో ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒక యూజర్ జొమాటోలో (Zomato) ఆర్డర్ చేయగా.. అది తిన్న తర్రవాత తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


నికితా తోష్నివాల్ (Nikitha Toshniwal) అనే ఓ యూజర్ ఎక్స్ వేదికగా రాస్తూ.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే ముందుకు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించింది. ఈ రోజుల్లో ఇది అస్సలు సురక్షితం కాదని, ముఖ్యంగా జొమాటో నాణ్యత విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది. ఇటీవల తాను, తన స్నేహితులు కలిసి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశామని.. అది ఏమాత్రం బాగోలేదని, అనారోగ్యకరంగా ఉందని తెలిపింది. ఒక కర్రీలో అదనంగా నూనె వేశారని పేర్కొంది. ఆ ఫుడ్ తినడం వల్ల తాము అనారోగ్య బారిన పడ్డామని చెప్పింది. ఈ విషయంపై తాము జొమాటోకో మెయిల్ చేశామని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని, సపోర్ట్ సిస్టమ్ ఘోరంగా ఉందని మండిపడింది. ఈ మధ్య తన యూజర్లను జొమాటో అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చింది.

ఈ విషయం తమ దృష్టికి చేరడంతో.. జొమాటో వెంటనే ఎక్స్ వేదికగా నికితాకు బదులిచ్చింది. అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని, దీనిపై వెంటనే విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. ‘‘నికితా.. మీరు ఎదుర్కున్న కష్టాల గురించి తెలిసి మేమెంతో నిరాశకు గురయ్యాం. మీకు సేవలు అందించడం కోసమే మేమున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు మాకు కొంత సమయం ఇవ్వండి, త్వరలోనే మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తాం’’ అని జొమాటో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇతర యూజర్లు సైతం జొమాటో సర్వీసులపై తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 09:54 PM

Advertising
Advertising