ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ టెక్నిక్ తెలియక పూరీలు చేయడానికి ఎంత టైమ్ వేస్ట్ చేశాం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:51 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కష్టమైన పనులను చేయడానికి కొందరు ఉపయోగించే సింపుల్ టెక్నిక్స్ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Puri making

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కష్టమైన పనులను చేయడానికి కొందరు ఉపయోగించే సింపుల్ టెక్నిక్స్ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో (Jugaad videos) సోషల్ మీడియాలో అవుతోంది. పూరీలను (Puri) కష్టపడి వత్తనవసరం లేకుండా ఓ మహిళ సింపుల్‌గా, వేగంగా ఎలా చేస్తోందో చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


itz__ruchi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ వంట గదిలో పూరీలను వత్తుతోంది. అయితే ఆమె పూరీలను వత్తే కర్ర ఉపయోగించడం లేదు. పిండిని ఓ కవర్ కింద పెట్టి దానిపై ఓ పళ్లెంతో అదుముతోంది. ఆ బరువుకు పిండి గుండ్రంగా పూరీ ఆకారంలోకి వచ్చేస్తోంది. దానిని తీసుకెళ్లి పెనంలో వేసి ఆమె కాల్చుతోంది. ఆ ప్రక్రియను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఐడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో 4.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. 5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇక, పూరీ మేకింగ్ మెషిన్ వద్దు``, ``ఇది చాలా మంచి ఐడియా``, ``మహిళలు ఎంతో తెలివిగా ఆలోచిస్తారో చూడండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదు.. పల్సర్ బైక్‌కు ట్రాక్టర్ చక్రం బిగించి ఎంత వేగంగా వెళ్తున్నాడో చూడండి..


Picture Puzzle: మీ మెదడుకు మేత.. ఈ రెండు ఫొటోల్లో ఉన్న 4 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 12:51 PM

Advertising
Advertising
<