ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇది ``మంజుమ్మల్ బాయ్స్`` కథ.. మొబైల్ కోసం గుహలోకి వెళ్లిన యువతికి ఏమైందంటే..

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:46 AM

మీరు ``మంజుమ్మల్ బాయ్స్`` సినిమా చూశారా? ఆ సినిమాలో ఓ వ్యక్తి కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో చిక్కుకుపోతాడు. అతడిని కాపాడేందుకు అతడి స్నేహితులు, రెస్క్యూ టీమ్ ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతికి కూడా తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది.

woman was stuck between rocks

విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకున్న మలయాళ సినిమా ``మంజుమ్మల్ బాయ్స్`` (Manjummel Boys) చూశారా? ఆ సినిమాలో ఓ వ్యక్తి కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో చిక్కుకుపోతాడు. అతడిని కాపాడేందుకు అతడి స్నేహితులు, రెస్క్యూ టీమ్ ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆస్ట్రేలియా (Australia)కు చెందిన ఓ యువతికి కూడా తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. చేతుల నుంచి జారిపోయిన మొబైల్‌ (Mobile)ను తెచ్చుకోవడానికి వెళ్లిన యువతి గుహ (Cave)లోని రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. తల్లక్రిందులుగా దాదాపు ఏడు గంటల పాటు ఉండిపోయింది. చివరకు అతి కష్టం మీద రెస్క్యూ టీమ్ కాపాడింది (Viral News).


ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న హంటర్ వ్యాలీలో (Hunter Valley) ఈ ప్రమాదకర ఘటన జరిగింది. బాధిత యువతి తన స్నేహితులతో కలిసి హంటర్ వ్యాలీని చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ రాళ్ల మధ్యలో పడిపోయింది. ఆ ఫోన్‌ను తీసుకోవడానికి ఆ యువతి ఆ రాళ్ల మధ్యలోకి వెళ్లిపోయింది. అయితే బండ రాళ్ల మధ్య చిక్కుకుని బయటకు రాలేకపోయింది. గట్టిగా ప్రయత్నించడంతో ఆమె కాళ్లు రాళ్ల మధ్యలో చిక్కుకుపోయి తల్లకిందులు అయిపోయింది. దీంతో ఆమె స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. మల్టీ-డిసిప్లినరీ రెస్క్యూ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఆ యువతిని చేరుకోవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు.


దీంతో దాదాపు 500 కేజీల బరువున్న రాయిని తొలగించడానికి ఓ భారీ వాహనాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి ఆ యువతిని రక్షించారు. ఆ ఏడు గంటలూ ఆమె ఆ గుహలో తల్లకిందులుగా వేలాడుతూనే ఉంది. అయితే అదృష్టవశాత్తూ ఆ యువతికి ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే అంత రిస్క్ చేసిన ఆ యువతి తన మొబైల్‌ను మాత్రం తిరిగి దక్కించుకోలేకపోయింది. మొబైల్ పూర్తిగా లోయలోకి జారిపోవడంతో దొరకలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి..


Viral: ఆ స్కూల్‌లో పేరెంట్స్‌‌కి కూడా ఫీజు కట్టాల్సిందే.. నర్సరీకి ఎంత ఫీజు కట్టాలో తెలిస్తే.. పోస్ట్ వైరల్..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``Kite`` పదాన్ని 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2024 | 02:12 PM