ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మీరు ఈ లేఖ చదువుతున్నారంటే.. తనకు చావు తప్పదని తెలిసి మహిళ బహిరంగ లేఖ

ABN, Publish Date - Feb 25 , 2024 | 04:49 PM

తనకు మరణం తప్పదని తెలిసి ఓ మహిళ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: తనకు మరణం తప్పదని తెలిసి ఓ మహిళ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral) మారింది. కంటతడి పెట్టించేలా ఉన్న ఈ లేఖకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. క్యాన్సర్ బారిన పడి (Cancer Patient) మృతి చెందిన బ్రిటన్ (UK) వనిత డానియేలా తన చివరి రోజుల్లో ఈ లేఖ రాసింది.

Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ ఆఫీసరని తెలీక..

‘‘మీరీ లేఖ చదువుతున్నారంటే నేను చనిపోయినట్టే. నా బదులు ఈ లేఖను నా కుటుంబసభ్యులు పోస్ట్ చేశారు’’ అని డానియేలా తన లేఖను ప్రారంభించింది. కొలాజియోకార్సినోమా అనే అరుదైన క్యాన్సర్ తనకు వచ్చిందని తెలిపింది. క్యాన్సర్ వ్యాధులన్నీ మనకున్న అలవాట్లా కారణంగానే రావని వివరించింది. కొన్ని జన్యుపరంగా కూడా రావచ్చని చెప్పింది.

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..


‘‘మన జీవితంపై మనకు పూర్తి కంట్రోల్ ఉండదు. కానీ, మనం ఎలా ప్రతిస్పందించాలనే దానిపై మన నియంత్రణ ఉంటుంది. జీవితం ముగిసిపోతున్నందుకు నాకు బాధగాలేదు. మిగిలున్న ఈ కొద్ది క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నా. నేను కోరుకున్నవి చాలా మటుకూ నాకు దక్కాయి. కాబోయే భర్త, నా కుటుంబం, ఫ్రెండ్స్, పెంపుడు కుక్క, నేను ఉంటున్న ఇల్లు, అన్నీ నాకు దక్కాయి. మేము పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలిన అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగింది. అయితే, నేను సానుకూల దృక్పథంతోనే ఉంటా. నాకు జీవితంలో తారసపడ్డ ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు’’ అంటూ ఆమె లేఖ ముగించింది.

మనసుకు తాకేలా ఉన్న ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. డానియేలా సానుకూల దృక్పథం చూసి అనేక మంది ప్రశ్నంసలు కురిపించారు. జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు కాబట్టి ప్రతి క్షణం ఆస్వాదించాలని, ప్రతికూల భావాలకు తావివ్వకూడదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 04:53 PM

Advertising
Advertising