World Richest Family: ప్రపంచంలోనే అత్యంత ధనిక ఫ్యామిలీని చుశారా...రూ.4000 కోట్ల ప్యాలెస్, 8 జెట్‌లు
ABN, Publish Date - Jan 19 , 2024 | 07:29 PM
ప్రతి ఒక్కరు కూడా ఖరీదైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, మంచి దుస్తులు ధరించి విలాసవంతంగా జీవించాలని కోరుకుంటారు. కానీ అది మాత్రం కొంత మందికే సాధ్యమవుతుంది. అయితే ఇటివల బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఆసక్తికర అంశాలను ప్రకటించింది.
ప్రతి ఒక్కరు కూడా ఖరీదైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, మంచి దుస్తులు ధరించి విలాసవంతంగా జీవించాలని కోరుకుంటారు. కానీ అది మాత్రం కొంత మందికే సాధ్యమవుతుంది. అయితే ఇటివల బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఆసక్తికర అంశాలను ప్రకటించింది. వాటిలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కుటుంబాన్ని పరిచయం చేసింది.
అతనే దుబాయ్‌కు చెందిన అల్ నహ్యాన్ రాజు. తనకు 2023 వరకు 305 బిలియన్ డాలర్ల (రూ. 25 లక్షల కోట్లు) నికర సంపద ఉన్నట్లు నివేదిక తెలిపింది. అంతేకాదు వారి విలాసవంతమైన సౌకర్యాలలో రూ.4,078 కోట్ల భవనం, ఎనిమిది ప్రైవేట్ జెట్‌లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ సహా అనేక ఉన్నాయని వెల్లడించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్
UAE అధ్యక్షుడైన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను MBZ అని కూడా పిలుస్తారు. ఇతనికి పెద్ద ఫ్యామిలీ ఉండగా..వారిలో 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. ఎమిరాటి రాజ కుటుంబంలో అతనికి తొమ్మిది మంది పిల్లలు, 18 మంది మనవరాళ్ళు కూడా కలరు. ఈ ఫ్యామిలీకి ప్రపంచంలోని అనేక సంస్థల్లో వాటాలు ఉండటం విశేషం. చమురు నిల్వలు, మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆరు శాతం వాటా ఉంది.
అంతేకాదు గాయకుడు రిహన్న బ్యూటీ బ్రాండ్ ఫెంటీ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ X వరకు వీరికి అనేక సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఈ కుటుంబం అబుదాబిలో బంగారం వర్ణంలో ఉన్న అధ్యక్ష భవనంలో నివసిస్తుంది. UAEలో వారు కలిగి ఉన్న అనేక ప్యాలెస్‌లలో ఇది అతిపెద్దది కాగా.. దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్‌లో స్ఫటికాలతో తయారు చేయబడిన షాన్డిలియర్, విలువైన చారిత్రాత్మక కళాఖండాలు అనేకం ఉన్నాయి.
Updated Date - Jan 19 , 2024 | 07:29 PM