Passport: ప్రపంచంలో పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లు ఇవే.. భారత పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందంటే..!
ABN, Publish Date - Jul 24 , 2024 | 10:18 AM
ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాల్సిందే. పాస్‌పోర్ట్ పొందడం అంత సులభం కాదు. పోలీస్ వెరిఫికేషన్ దగ్గర్నుంచి ఎన్నో నిబంధనలు పాటించి, అన్నీ సక్రమంగా ఉన్నాయంటేనే పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి పాస్‌పోర్ట్ చేతికి వస్తుంది.
ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ (Passport) ఉండాల్సిందే. పాస్‌పోర్ట్ పొందడం అంత సులభం కాదు. పోలీస్ వెరిఫికేషన్ దగ్గర్నుంచి ఎన్నో నిబంధనలు పాటించి, అన్నీ సక్రమంగా ఉన్నాయంటేనే పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి పాస్‌పోర్ట్ చేతికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణం సంఘం నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఈ జాబితాను విడుదల చేసింది (Most Powerful Passports).
ఈ జాబితా ప్రకారం సింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైనది. వీసా లేకుండా కేవలం సింగపూర్ పాస్‌పోర్ట్ చూపించి 195 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ పాస్‌పోర్ట్‌లతో 192 దేశాల్లోకి వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఇక, మూడో స్థానంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి వీసాలు అవసరం లేకుండా 191 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. ఇక, నాలుగో స్థానంలో ఉన్న యూకే, న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్ పాస్‌పోర్ట్‌లతో 190 దేశాల్లోకి వీసా-ఫ్రీ ఎంట్రీ పొందవచ్చు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నాయి. అమెరికా ఎనిమిదో స్థానంలో ఉంది. అమెరికా పాస్‌పోర్ట్‌తో 186 దేశాల్లోకి వీసా లేకుండా వెళ్లవచ్చు. ఈ జాబితాలో భారత్ పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. గతంలో ఉన్న 85వ స్థానం నుంచి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 82వ స్థానానికి చేరుకుంది. భారత పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లోకి వీసా లేకుండా ఎంటర్ కావచ్చు.
ఇవి కూడా చదవండి..
Viral Video: హాస్పిటల్ బెడ్ మీదున్న యజమాని.. పాకుతూ వచ్చిన ఏనుగు ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 24 , 2024 | 10:18 AM