చక్రంతో యోగం
ABN, Publish Date - Dec 01 , 2024 | 07:21 AM
పార్కులో యోగాకు వెళ్లాలంటే ఒక యోగా మ్యాట్, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. అదే యోగా స్టూడియోలో అయితే ఈమధ్య ‘యోగా వీల్’ కూడా ఉంటోంది. కాన్సెప్ట్ పాతదే కానీ... మోడ్రన్‌గా ఉండే ఈ ‘చక్రం’ నవతరాన్ని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏమిటీ యోగా వీల్?
పార్కులో యోగాకు వెళ్లాలంటే ఒక యోగా మ్యాట్, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. అదే యోగా స్టూడియోలో అయితే ఈమధ్య ‘యోగా వీల్’ కూడా ఉంటోంది. కాన్సెప్ట్ పాతదే కానీ... మోడ్రన్‌గా ఉండే ఈ ‘చక్రం’ నవతరాన్ని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏమిటీ యోగా వీల్?
సాధారణంగా యోగా చేసేప్పుడు చేతులు, కాళ్లు లేదా సపోర్టుతో ఆసనాలు వేస్తారు. అయితే వీల్‌ను ఉపయోగించుకుని ఆసనాలు వేయటమే ‘వీల్ యోగా’.
మామూలు యోగాలో కాకుండా అడ్వాన్స్‌డ్ యోగాలో ఈ వీల్‌ను వాడతారు. 13 సెంటీమీటర్ల వెడల్పుతో 40 సెంటీమీటర్ల వృత్తాకార చక్రం ఉంటుంది. ముఖ్యంగా వెన్నెముక స్ర్టెచ్ కోసం ఈ వీల్‌ను డిజైన్ చేశారు. ఛాతీ, మెడ వంటి భాగాల్లో కూడా ఒత్తిడి తగ్గిస్తుంది.
ఈ వీల్‌తో శరీరానికి సెల్ఫ్ మసాజ్ చేసు కోవటం వల్ల ఒత్తిడిలాంటివి తొలగిపోతాయి. మెడనొప్పి, వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
యోగా వీల్ ఉపయోగించడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాక్‌బెండ్‌కు సపోర్టుగా ఉండటమే కాకుండా కండరాల బలానికి ఉపయోగ పడుతుంది.
యోగా వీల్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఇవి తక్కువ బరువు ఉంటాయి. సౌకర్యంగా ఉండేందుకు ఫోమ్‌షీట్ వాడతారు. చెక్క వీల్‌కు ఫోమ్ లేదా కార్క్‌ను ఉపయోగిస్తారు. కార్క్ వీల్ అయితే సహజంగా ఎకో ఫీల్‌ను కలిగిస్తుంది.
యోగా వీల్ కాన్సెప్ట్‌ను 2013లో ‘జూలెస్ మిచెల్’ అనే అమెరికన్ కనిపెట్టింది. లాస్ వెగాస్‌లో ఉండే ఈ ట్రైనర్ యోగాలో సరికొత్త ప్రయోగాలు చేస్తుంది. కుర్చీ, తాడు, ఇటుకలా ఉండే అతి చిన్న బల్ల.. ఇలా వీటితో యోగా చేస్తుంది. యోగా కోర్సులు బోధిస్తుంది. ఆన్‌లైన్‌లో 300 గంటల మారథాన్ యోగా ట్రైనింగ్స్ చేస్తుంటుంది. ఆమె ‘యోగా బయోమెకానిక్స్- స్ర్టెచింగ్ డిఫైన్డ్’ పుస్తకం రాశారు. మిచెల్ రూపొందించిన యోగా వీల్ కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతూ మరింత మోడ్రన్‌గా మారింది.
జిమ్‌లో ట్రైనర్ లేకుండా వ్యాయామం చేయనట్టే... ఈ వీల్‌తో సొంతంగా యోగా చేస్తే నొప్పులు, ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. అందుకే ట్రైనర్ పర్యవేక్షణలోనే వీల్ యోగా సాధన చేయాలి.
Updated Date - Dec 01 , 2024 | 07:21 AM