Optical illusion: ఇందులో మొదట కనిపించిన దృశ్యమే చెప్పేస్తుంది.. మీరు రొమాంటిక్ పర్సనా.. లేక జీనియస్సా..
ABN, Publish Date - Mar 09 , 2024 | 04:43 PM
చూసే దృష్టి కోణాన్ని బట్టి మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మనలోని సృజనాత్మకతను తెలియజేసేలా సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలను చూడగానే పైకి ఒకటి అనిపిస్తే.. అందులో అంతర్లీనంగా మరో దృశ్యం దాక్కుని ఉంటుంది. అయితే..
చూసే దృష్టి కోణాన్ని బట్టి మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మనలోని సృజనాత్మకతను తెలియజేసేలా సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలను చూడగానే పైకి ఒకటి అనిపిస్తే.. అందులో అంతర్లీనంగా మరో దృశ్యం దాక్కుని ఉంటుంది. అయితే చూసే దృష్టిని, ఆలోచనను బట్టి దాన్ని గుర్తించడం సాధ్యం అవుతుంది. ఇలాంటి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral photo) వైరల్ అవుతోంది. ఇందులో మీకు మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆధారంగా.. మీరు రొమాటింట్ పర్సనా.. లేక జీనియస్సా అని తెలిసిపోతుందన్నమాట..
సోషల్ మీడియలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ సరస్సు ఒడ్డున కొన్ని ఎత్తైన చెట్టు మనకు కనిపిస్తాయి. అలాగే అక్కడే చంద్రుడు కూడా కనిపిస్తాడు. వాటి ప్రతిబింబాలు సరస్సులో కనిపిస్తుంటాయి. చూసేందుకు ఈ దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఈ ఫొటోను చూడగానే మీకు ముందుగా ఏ దృశ్యం కనిపించిందో దాని ఆధారంగా మీ మనస్థత్వాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫొటోను తీక్షణంగా పరిశీలిస్తే.. మీకు ఓ గిటార్ కనపడుతుంది. దీన్ని గుర్తించినట్లయితే మీరు జీనియస్ అని చెప్పొచ్చు. ఇలాంటి వారు సమయాన్ని వృథా చేయకుండా తాము అనుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్తారు. అలాగే చంద్రుడు, వెన్నెల, చెట్లు కనిపిస్తే.. మీరు రొమాంటిక్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇలాంటి వారు ప్రేమ, అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని అర్థం. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రై చేసి, మీరు ఎలాంటి మనస్థత్వాన్ని కలిగి ఉన్నారో చెక్ చేసుకోండి.
Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?
Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..
మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 09 , 2024 | 05:11 PM