Viral: మాతృదేశాన్ని కాదని ఇండియాలో సెటిలైన ఫ్రెంచ్ జాతీయుడు! ఎందుకంటే..
ABN, Publish Date - Jun 14 , 2024 | 06:08 PM
ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎందరో భారతీయులు విదేశాల్లో సెటిలవుతున్నారు. కానీ ఒక ఫ్రాన్స్ జాతీయుడు మాత్రం ఇందుకు భిన్నంగా భారత్‌లో సెటిలయ్యాడు. మాతృదేశాన్ని కాదని భారత్‌ను ఎంచుకున్న అతడు ఈ దేశ గొప్పతనాన్ని వివరిస్తూ చేసిన యూట్యూబ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎందరో భారతీయులు విదేశాల్లో సెటిలవుతున్నారు. కానీ ఒక ఫ్రాన్స్ జాతీయుడు మాత్రం ఇందుకు భిన్నంగా భారత్‌లో సెటిలయ్యాడు. మాతృదేశాన్ని కాదని భారత్‌ను ఎంచుకున్న అతడు ఈ దేశ గొప్పతనాన్ని వివరిస్తూ చేసిన యూట్యూబ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. జానాలతో మేరా భారత్ మహాన్ అని అనిపిస్తోంది.
జీన్ బాప్టీస్ట్ అనే ఫ్రెంచ్ జాతీయుడు దాదాపు 20 ఏళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. తాను భారత్ ఎందుకు ఎంచుకున్నదీ చెబుతూ ఓ వీడియో చేశారు. ఓవైపు, ఉరుకులపరుగుల నగరజీవితం. మరోవైపు ప్రశాంతతనిచ్చే గ్రామీణ వాతావరణం తనను కొట్టిపడేశాయని అన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో మర్యాదగా, ఉన్నత విలువలు కలిగి ఉంటారని ప్రశంసించాడు. పాశ్చాత్యుల్లో కనిపించే ఇగోలు లేకుండా ఎంతో కలివిడిగా, స్నేహభావంతో ఉంటారని చెప్పుకొచ్చారు (You Never Feel Alone Here Why This Frenchman Chose India Over France).
Viral: వాడకం అంటే ఇదీ! సింహం నాలుకకు యాపిల్ వాచ్ తగిలించి.. ఎందుకో తెలిస్తే..
భారత్‌కు ఫ్రాన్స్‌కు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయని కూడా జీన్ తెలిపారు. రెండు దేశాల్లోనూ కుటుంబ బంధాలకు అమిత ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఇరు దేశాల వారు కళలకు, ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారని వివరించాడు. అంతేకాకుండా, ఇరు దేశాలూ తమ సంస్కృతిని గొప్పగా గౌరవిస్తాయని అన్నారు. ఈ సారూప్యతలే తనను భారతీయుల మధ్య సులువుగా ఇమిడిపోయేలా చేశాయని అన్నారు. భారత్‌లో ఉంటే ఒంటరితనమే అనిపించదని చెప్పారు.
భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం ద్వారా తాను దృఢమైన స్నే్హ బంధాల్ని పెంపొందించుకున్నానని చెప్పారు. ఇక్కడ భాష నేర్చుకోవడం, పండుగల్లో పాలుపంచుకోవడం ద్వారా ఎందరో స్నేహితులు తనకు దక్కారని చెప్పాడు. భారత్‌లో ఆధ్యాత్మిక వాతావరణం తనకు మాటలకు అందని మానసిక ప్రశాంతత ఇచ్చిందని, అందుకే తాను భారత్‌లోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్నానని అతడు చెప్పాడు. దీంతో, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Updated Date - Jun 14 , 2024 | 07:12 PM