Viral Video: వామ్మో.. ఇలా తయారయ్యారేంటి.. ఆ వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN, Publish Date - Nov 09 , 2024 | 09:06 AM
కొన్ని వీడియోలు ఆసక్తికరంగా, ఫన్నీగా ఉండి మన్నలి ఆకట్టుకుంటుంటాయి. దీంతో చాలా మంది వెరైటీ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి వీడియోనే నెటిజన్లకు షాకిస్తోంది.
ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, ఫన్నీగా ఉండి మన్నలి ఆకట్టుకుంటుంటాయి. దీంతో చాలా మంది వెరైటీ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి వీడియోనే (Jugaad Video) నెటిజన్లకు షాకిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్ (Helmet) చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. laughwith_mm19 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిత్రీకరించారు. ఓ వ్యక్తి మూడు చక్రాల రిక్షాపై వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నాడు. అతడి తల మీద వెరైటీ హెల్మెట్ ఉంది. 20 లీటర్ల వాటర్ క్యాన్ (Water Can) కింద రంధ్రం చేసి దానిని అతడు తన తలపై పెట్టుకున్నాడు. ఆ వెరైటీ హెల్మెట్‌ను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అదే సిగ్నల్ దగ్గర ఆగిన ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 1.3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఆల్ట్రా ప్రో మ్యాక్స్ హెల్మెట్``, ``ఇది లెవెల్-4 హెల్మెట్``, ``ఈ వ్యక్తి తన విచిత్రమైన ఐడియాతో ఓ వ్యవస్థను అయోమయానికి గురి చేశాడు``, ``దీని వల్ల ఉపయోగం ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్.. పేరెంట్స్‌కు ఎలా దొరికిపోయిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 09 , 2024 | 11:08 AM