ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ట్రైన్‌తో సూపర్ స్టంట్ చేసిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.. పోలీసులు అరెస్ట్ చేద్దామని వెళ్లి షాక్! ఎందుకంటే..

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:19 AM

డిజిటల్ మీడియాలో రీల్స్‌కు (Reels) ఆదరణ విపరీతంగా పెరగడంతో పాపులర్ అయ్యేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత రీల్స్ కోసం చేసే సాహసాలు (Dangerous stunts) వారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి.

Dangerous Stunt on moving Train

డిజిటల్ మీడియాలో రీల్స్‌కు (Reels) ఆదరణ విపరీతంగా పెరగడంతో పాపులర్ అయ్యేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత రీల్స్ కోసం చేసే సాహసాలు (Dangerous stunts) వారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఆ వీడియోలోని కుర్రాడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది (Viral Video).


వైరల్ అయిన ఆ వీడియోలో కుర్రాడు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరిన రైలు గేటును పట్టుకుని బయటకు వేలాడుతూ స్కేటింగ్ ప్రారంభించాడు. రైలు గేటు పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పై చాలా దూరం వరకు జారుకుంటూ వెళ్లాడు. రైలు ప్లాట్‌ఫామ్ అంచుకు చేరుకున్న తర్వాత రైలు లోపలికి ప్రవేశించాడు. అతడి స్టంట్‌ను ఆ రైలులో ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లింది. రైల్వే పోలీసులు ఆ కుర్రాడిని గుర్తించి అతడిని అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు.


ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి అతడిని చూసిన రైల్వే పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే ఆ కుర్రాడికి ఒక కాలు, చేయి లేవు. ఇటీవల అదే తరహాలో ఓ స్టంట్ చేస్తుండగా భారీ ప్రమాదం జరిగి ఆ కుర్రాడు కాలు, చేయి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. ఆ కుర్రాడితో పోలీసులు మాట్లాడుతున్న వీడియోను రైల్వే పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!


Viral: ఒక్క సంవత్సరంలో 48 కిలోలు మాయం.. స్పెషల్ సీక్రెట్ చెప్పిన బ్రిటన్ మహిళ!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2024 | 10:19 AM

Advertising
Advertising
<