Viral Video: చిన్నప్పుడు తరగతి గదిలో ఇలా చేశారా.. అంటూ యువతి వింత ప్రశ్న.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
ABN, Publish Date - Jan 25 , 2024 | 04:12 PM
స్కూల్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజులు తలచుకున్నప్పుడల్లా మనసంతా ఆనందంతో నిండిపోతుంటుంది. తరగతి గదిలో...
స్కూల్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజులు తలచుకున్నప్పుడల్లా మనసంతా ఆనందంతో నిండిపోతుంటుంది. తరగతి గదిలో తోటి విద్యార్థులతో ముచ్చట్లు, టీచర్ల మందలింపులు, క్లాస్ డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం.. ఇలా ప్రతి అనేక జ్ఞపకాలు సందర్భానుసారం గుర్తుకువచ్చి గతాన్ని గుర్తు చేస్తుంటాయి. తాజాగా ఓ యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఓ ప్రశ్న అడిగింది. తరగతి గదిలో మీ చిన్న వయసులో ఇలాంటి పనులు చేశారా.. అన్న ఆమె ప్రశ్నకు నెటిజన్ల రియాక్షన్ ఏంటో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్కూల్లోకి వెళ్లగానే ప్రతి రోజూ బోర్డుపై జీవితానికి సంబంధించి కొటేషన్ (School Quotations) రాయడం సర్వసధారణం. ఇది విద్యార్థులు కానీ లేక క్లాస్ లీడర్ కానీ కాస్తూ ఉండడం అందరికీ తెలిసిందే. దీనిపై ఓ యువతి నెటిజన్లను ప్రశ్నించింది. ‘‘మీరు మరాఠీ చదివిన వారైతే.. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి’’.. అంటూ ‘‘మీ చిన్నప్పుడు తరగతి గదిలో బోర్డుపై రోజూ రాసే సందేశాల్లో ఎక్కువగా గుర్తుకొచ్చేవి ఏంటో చెప్పండి’’.. అని అడిగింది.
Viral Video: ఆత్మహత్య చేసుకునేందుకు వంతెన ఎక్కిన వ్యక్తి.. పోలీసుల బంపర్ ఆఫర్ విని ఏం చేశాడంటే..
యువతి ప్రశ్నకు.. మరాఠీ చదువుకున్న విద్యార్థులతో పాటూ అన్ని భాషల వారూ స్పందిస్తున్నారు. ‘‘అన్ని భాషల విద్యార్థులకూ ఇది మరపురాని జ్ఞాపకం’’.., ‘‘చెడపకురా చెడేవు’’, ‘‘సోమరితనం మనిషికి శత్రువు’’.., ‘‘ప్రార్థించే పెదవులకంటే.. సాయం చేసే చేతులు మిన్న’’.., ‘‘నిజం నిప్పులాంటిది’’.., ‘‘కత్తి కంటే కలం గొప్పది’’.., ‘‘గుర్రాన్ని చెరువు కాదా తీసుకెళ్లొచ్చు గానీ.. నీరు తాగించలేం’’.., ‘‘వైఫల్యమే విజయానికి మొదటి మెట్టు’’.., ‘‘సమయం ఎవరికోసమూ ఆగదు’’.., ‘‘కష్టం లేనిదే ఫలితం దక్కదు’’.. ఇలా ఒక్కొ్క్కరు తమ స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.4లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Kitchenhacks: దువ్వెన వాడే ముందు ఇలా చేశారంటే.. ఏం జరుగుతుందో తెలుసా..
Updated Date - Jan 25 , 2024 | 04:12 PM