ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వేడి నీరు పట్టుకొచ్చిన యువతి.. తమాషా చేస్తుందనుకుంటే.. చివరకు అందరికీ పెద్ద షాకే ఇచ్చింది..

ABN, Publish Date - Jan 09 , 2024 | 08:56 PM

కొందరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. చాలా మంది పైకి ఎంతో మంచిగా కనిపిస్తుంటారు. కానీ లోపల మాత్రం పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. సమయం వచ్చినప్పుడు వారి శాడిజం మొత్తం బయటపెడుతుంటారు. ఈ క్రమంలో...

కొందరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. చాలా మంది పైకి ఎంతో మంచిగా కనిపిస్తుంటారు. కానీ లోపల మాత్రం పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. సమయం వచ్చినప్పుడు వారి శాడిజం మొత్తం బయటపెడుతుంటారు. ఈ క్రమంలో కొందరైతే జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వేడి నీరు పట్టుకొస్తున్న యువతిని చూసి తమాషా చేస్తుందేమో అనుకున్నారు. కానీ చివరకు ఆమె చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. కొందరు యువతీయువకులంతా కలిసి పార్టీ చేసుకుంటుంటారు. అంతా కలిసి ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు పలు గేమ్‪‌లు కూడా ఆడుకున్నారు. అయితే ఈ క్రమంలో ఓ యువతి చేసిన నిర్వాకంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పక్కనే ఉన్న ఓ గదిలోకి వెళ్లిన యువతి.. వచ్చే సమయంలో పాత్రలో సలసలా కాగుతున్న వేడి నీటిని పట్టుకుని వచ్చింది. ఆ నీటితో ఏదైనా ప్రాంక్ వీడియో చేస్తుందేమో అని అంతా అనుకున్నారు.

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకుని సమీపానికి వచ్చిన బైకర్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

లోపలి నుంచి వేడి నీటిని పట్టుకొచ్చిన ఆమె.. వచ్చీరాగానే ఎదరుగా ఉన్న ఓ వ్యక్తి మొఖంపై (woman throws boiling water on friend) నీటిని చల్లేసింది. ఆ సమయంలో అతను ఫోన్ చూసుకుంటూ పరధ్యానంలో ఉంటాడు. వేడి నీరు మొఖంపై పడగానే ధబేల్‌మని కిందపడిపోతాడు. గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు పెడతాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. వారిద్దరి మధ్యలో గతంలో గొడవలు జరిగినట్లు తెలిసింది. ఇది మనసులో పెట్టుకున్న ఆమె.. చివరకు వేడి నీరు పోసి కక్ష తీర్చుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jan 09 , 2024 | 08:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising