ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చైనా రైళ్లు కూడా ఇలాగే ఉంటాయా? చైనా రైళ్ల జనరల్ కంపార్ట్‌‌మెంట్ పరిస్థితి వివరించిన యూట్యూబర్..

ABN, Publish Date - Sep 22 , 2024 | 02:56 PM

భారతీయ రైళ్లు ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తాయి. మన దేశంలో చాలా మంది తమ ప్రయాణాల కోసం రైళ్ల పైనే ఆధారపడుతుంటారు. చాలా చౌకైన, సౌకర్యవంతమైన రైలు జర్నీనే చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో మన రైళ్లన్నీ జనాలతో కిటకిటలాడుతుంటాయి.

China Bullet Train

భారతీయ రైళ్లు (Indian Railway) ప్రతిరోజూ కొన్ని కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తాయి. మన దేశంలో చాలా మంది తమ ప్రయాణాల కోసం రైళ్ల పైనే ఆధారపడుతుంటారు. చాలా చౌకైన, సౌకర్యవంతమైన రైలు జర్నీనే (Train Journey) చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో మన రైళ్లన్నీ జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఏ భోగీ ఖాళీ ఉండదు. ఇక, జనరల్ కంపార్ట్‌మెంట్ల గురించైతే చెప్పనక్కర్లేదు. జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. మనదేశంలోనే కాదు.. చైనా (China)లో కూడా ఇదే పరిస్థితి అంటూ ఓ యూట్యూబర్ వివరించాడు. అక్కడి బుల్లెట్ రైళ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించాడు (Viral Video).


యూట్యూబర్‌ శుభం.. చైనా బుల్లెట్ ట్రైన్‌( China Bullet Train) లోపలి వీడియో తీశారు. జనరల్ కంపార్ట్‌‌మెంట్‌ను చూపించారు. ఆ వీడియోలో, ప్రయాణికులు చాలా ఇరుకుగా కూర్చుని, కొందరు నిలబడి ఉన్నారు. కొందరు టాయిలెట్ల దగ్గర నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా సీటు కింద పడుక్కుని ఉన్నాడు. సాధారణంగా బుల్లెట్‌ ట్రైన్‌ అంటే సీట్లు బాగుంటాయని అనుకుంటాం. కానీ ఆ వీడియోలోని ట్రైన్ సీట్లు అంత కంఫర్టబుల్‌గా లేవని శుభం తెలిపారు. ఇంకో విశేషమేమిటంటే.. కొంతమంది తమ సొంత కుర్చీలు, బకెట్లు కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆ రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్లకు కూడా ఏసీలు, ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైలర్ వీడియోను ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``చైనా సాధారణ రైళ్లు మన దేశపు వందే భారత్‌ రైళ్లలాగే ఉంటాయి``, ``చైనా రైళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి``, ``అక్కడి ప్రజలు రైళ్లను చాలా విజ్ఞతతో ఉపయోగిస్తుంటారు``, ``జనాలు ఎక్కువైతే ఎక్కడైనా పరిస్థితి ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేదిక మీద కొడుకు ట్యాలెంట్.. సంతోషంతో ఆ తండ్రికి కన్నీళ్లు.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!


Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: ఈ పేదవాడి మనసు చాలా పెద్దది.. చెప్పులు కుట్టే ఈ వ్యక్తి కోసం ఎంతో మంది ఎందుకు స్పందించారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 22 , 2024 | 02:56 PM