ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఆన్‌లైన్‌లో 10 కిలోల గోధుమ పిండి ఆర్డరిచ్చిన కస్టమర్‌.. ప్యాకెట్ చూసి షాక్!

ABN, Publish Date - May 20 , 2024 | 08:40 PM

జెప్టోలో గోధుమ పిండి ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మరో పదిరోజుల్లో ఎక్స్‌పైర్ కానున్న పిండి డెలివరీ కావడంతో అతడు షాకయ్యారు. చివరకు సంస్థ తీరును పబ్లిక్‌గా ఎండకట్టి రిఫండ్ రాబట్టుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: కాలుకదపకుండానే కావాల్సినవి ఇంటికి తెచ్చుకునే సౌలభ్యం ఉండటంతో అనేక మంది యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. తమ బిజీ షెడ్యూల్ కారణంగా అనేక మంది ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఆర్డర్లు పెడుతున్నారు. ఒకప్పుడు టిఫిన్లు, భోజనాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పచారీ సమాన్లకు వచ్చేసింది. ఈ క్రమంలో జెప్టో యాప్ ద్వారా 10 కేజీల గోధుమ పిండి ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: పెళ్లిలో వరుడిని చితక్కొట్టిన వధువు మాజీ బాయ్‌ఫ్రెండ్.. షాకింగ్ వీడియో


గజేంద్ర యాదవ్ అనే వ్యక్తి మే 15న జెప్టోలో 10 కేజీల గోధుమ పిండి ఆర్డరిచ్చారు. ఇంటికి డెలివరీ అయిన ప్యాకెట్ చూశాక అతడు దిమ్మెరపోయాడు. మరో పదిరోజుల్లో ప్యాకెట్ ఎక్సైర్ అవుతుందని ఉండటంతో అతడికి తిక్కరేగింది. ఎక్స్ వేదికగా జెప్టోను ఉతికిఆరేశాడు. ‘‘కనీసం కామన్‌సెన్స్ ఉందా మీకు? పది రోజుల్లో ఎక్స్‌పైర్ అయ్యే పిండిని పించారు. పది కిలోల పిండిని ఇంత తక్కువ సమయంలో తినగలమా?’’ అంటూ మండిపడ్డాడు. ఈ ఉదంతం వైరల్ కావడంతో జెప్టో స్పందించింది. అతడిని నేరుగా తమకు మెసేజ్ చేయమని సూచించింది (Zepto apologises after man gets almost expired 10Kg atta and this is what happened).


ఆ తరువాత కస్టమర్ కేర్ వారు తనను సంప్రదించినా ఎటువంటి పరిష్కారం చూపలేకపోయారని గజేంద్ర పేర్కొన్నాడు. రిఫండ్ ఇచ్చేది లేదని వారు చెప్పారని గజేంద్ర తెలిపారు. చివరకు పిండిని జెప్టో వ్యవస్థాపకులకు పంపిస్తానంటూ నెట్టింట పేర్కొన్నాడు. ఈ క్రమంలో మరోసారి సంస్థ ప్రతినిధులు అతడిని సంప్రదించి డబ్బులు తిరిగిచ్చేందుకు అంగీకరించాడు. తాను ఈ పిండిని సంస్థ వ్యవస్థాపకులకు పంపిస్తానని చెప్పడం పైఅధికారుల దాకా వెళ్లిఉండొచ్చంటూ అతడు సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా, ఘటనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆన్‌లైన్‌లో ఇలాంటి దారుణాలు ఎక్కువైపోయాయంటూ అనేక మంది వాపోయారు. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ సరిగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు.

Read Viral and Telugu News

Updated Date - May 20 , 2024 | 08:46 PM

Advertising
Advertising