Zomato: పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసిన కస్టమర్.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్.. జొమాటో రియాక్షన్ ఏంటంటే..
ABN, Publish Date - Jul 29 , 2024 | 01:41 PM
శ్రావణ మాస పూజలు చేసే ఓ మహిళ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో ద్వారా పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్ చూసి ఆమె నివ్వెరపోయింది.
శ్రావణ మాసం (Sawan Month) అంటే హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఆ నెలంతా మాంసాహారానికి (Chicken) దూరంగా ఉండాలని కొందరు భావిస్తారు. ఉత్తరాదిన గత పౌర్ణమి నుంచే శ్రావణ మాసం మొదలైపోయింది. దక్షిణాదిన మాత్రం అమావాస్య నుంచి శ్రావణ మాసం ప్రారంభమైనట్టు భావిస్తారు. అలాంటి శ్రావణ మాస పూజలు చేసే ఓ మహిళ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో (Zomato) ద్వారా పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్ చూసి ఆమె నివ్వెరపోయింది (Viral News).
ఢిల్లీ (Delhi)కి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా పాలక్ పన్నీర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు వచ్చిన పార్సిల్‌లో పాలక్ పనీర్ (Palak Paneer)కు బదులు చికెన్ ఉంది. అది చూసి ఆమె షాకైంది. ``నేను శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ డెలివరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు`` అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ఫుడ్‌కు సంబంధించిన ఫొటోలను ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆ ఫుడ్ పంపించిన ఈట్‌ఫిట్ రెస్టారెంట్‌ను, జొమాటోను ట్యాగ్ చేసింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై జొమాటో వెంటనే స్పందించింది. క్షమాపణలు తెలియజేసింది. సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ``మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి మీ ఆర్డర్, సంప్రదింపు వివరాలు అందించండి`` అంటూ ఈట్‌ఫిట్ రెస్టారెంట్ కూడా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Jul 29 , 2024 | 01:41 PM