ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Zomato: జొమాటో ఏజెంట్‌కు బర్త్ డే సర్‌ప్రైజ్.. గిఫ్ట్ అందించిన కస్టమర్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, Publish Date - Sep 01 , 2024 | 09:06 PM

జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన అతడికి వినియోగదారులు మరపురాని విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్సిల్ పట్టుకుని ఇంటికి వెళ్లగానే డోర్ తీసి అంతా కలిసి హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడారు. ఇది విని ఆ ఏజెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Zomato Customer's Sweet Gesture For Delivery Agent

జొమాటో (Zomato) ఫుడ్ డెలివరీ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన అతడికి వినియోగదారులు మరపురాని విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్సిల్ పట్టుకుని ఇంటికి వెళ్లగానే డోర్ తీసి అంతా కలిసి హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడారు. ఇది విని ఆ ఏజెంట్ (Delivery Agent) ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Viral Video)


iimyashshah అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ``స్ప్రెడ్ హ్యాపీనెస్`` అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అంత వర్షంలో కూడా ఆ జొమాటో ఏజెంట్ తన పని చేస్తున్నాడు. ఆ రోజు ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసిన వారికి యాప్ ద్వారా ఏజెంట్ బర్త్ డే (Birth day) అని తెలిసింది. వర్షంలో కూడా శ్రమిస్తున్న వ్యక్తికి బర్త్‌డే విషెస్ చెప్పాలని ముందే ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ ముందుదానే ప్లాన్ చేసుకున్నారు. ఏజెంట్ వచ్చీ రాగానే బర్త్‌డే సాంగ్ పాడి అతడిని ఆశ్చర్యపరిచారు. ఆ తరవాత ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. వీళ్లు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆ డెలివరీ ఏజెంట్‌ చాలా సంతోష పడిపోయాడు. ఆ ఘటన మొత్తాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. 81 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై జొమాటో సీఈవో దీపీందర్ గోయెల్, జొమాటో అధికారిక హ్యాండిల్ కూడా స్పందించాయి. కాగా, మంచి మనసుతో జొమాటో ఏజెంట్ బర్త్ డే జరిపిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ డెలివరీ ఏజెంట్‌ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. తన లైఫ్‌లో ఇలాంటిది ఫస్ట్‌టైమ్ జరిగిందని, చాలా గర్వంగా ఉందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..


Picture Puzzle: ఈ పజిల్‌లో ``Hero``ను కనిపెడితే మీరు నిజమైన హీరోనే.. 5 సెకెన్లలో పూర్తి చేయండి!


Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..


Viral Video: ఏం తెలివి గురూ.. బైక్‌ను ఆటోలా మార్చి ఐదుగురిని తీసుకెళ్తున్నాడు.. జుగాడ్ వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2024 | 09:06 PM

Advertising
Advertising