ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

100m Hurdles : రెపిచేజ్‌లో జ్యోతి

ABN, Publish Date - Aug 08 , 2024 | 05:29 AM

మహిళల 100 మీ. హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి నేరుగా సెమీ్‌సకు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే, రెపిచేజ్‌ రూపంలో ఆమెకు మరో అవకాశం లభించనుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌-1 హీట్‌-4లో జ్యోతి

మహిళల 100 మీ. హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి నేరుగా సెమీ్‌సకు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే, రెపిచేజ్‌ రూపంలో ఆమెకు మరో అవకాశం లభించనుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌-1 హీట్‌-4లో జ్యోతి 13.16 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. గురువారం రెపిచేజ్‌ రౌండ్‌ జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత్‌ అథ్లెట్‌ జ్యోతి.

కార్టర్స్‌లో ఓడిన భారత్‌: టేబుల్‌ టెన్ని్‌సలో భారత పోరాటం ముగిసింది. మహిళల టీమ్‌ ఈవెంట్‌ క్వార్టర్స్‌లో భారత్‌ 1-3తో జర్మనీ చేతిలో ఓడింది. డబుల్స్‌లో శ్రీజ-అర్చన జోడీ, సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో శ్రీజ, మనికా బాత్రా ఓడగా.. అర్చనా కామత్‌ మాత్రమే నెగ్గింది.

అంతిమ్‌ అవుట్‌..: కచ్చితంగా పతకం తెస్తుందనే భారీ అంచనాలున్న అంతిమ్‌ పంగల్‌ రౌండ్‌-16లోనే నాకౌటైంది. 53 కిలోల విభాగంలో అంతిమ్‌ 0-10తో యట్గిల్‌ జెనెప్‌ (టర్కీ) చేతిలో మట్టికరిచింది. జెనెప్‌ క్వార్టర్స్‌లో ఓడడంతో పంగల్‌కు రెపిచేజ్‌ కూడా ఆడే అవకాశం లేకుండా పోయింది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స కాంస్య పతక విజేత అయిన అంతిమ్‌.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్‌ బెర్త్‌ అందించింది.

అన్నూ రాణి విఫలం: మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూ రాణి ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయింది. గ్రూప్‌-ఎలో మూడు ప్రయత్నాల్లో అన్నూ 55.81 మీ., 53.22 మీ., 53.55 మీటర్ల దూరం మాత్రమే విసిరి 15వ స్థానంలో నిలిచింది. ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌ 62 మీటర్లు కాగా.. టాప్‌-12లో నిలిచేలా అన్నూ రాణి అత్యుత్తమ త్రో కూడా చేయలేక పోయింది. హైజం్‌పలో సర్వేష్‌ కుశాలె కూడా ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. క్వాలిఫికేషన్‌ మార్క్‌ 2.29 మీటర్లు కాగా.. గ్రూప్‌-బిలో సర్వేష్‌ 2.15 మీటర్ల ఎత్తు మాత్రమే దూకాడు. మూడు ప్రయత్నాల్లోనూ 2.20 మీటర్ల ఎత్తును లంఘించలేక పోయాడు. దీంతో గ్రూప్‌-బిలో 13వ స్థానంలో నిలిచాడు. మారథాన్‌ రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ రిలేలో సూరజ్‌ పన్వర్‌-ప్రియాంక గోస్వామి జోడీ రేస్‌ను ముగించలేక పోయింది. ఫైనల్‌ లెగ్‌లో గోస్వామి తప్పుకొంది.

Updated Date - Aug 08 , 2024 | 05:36 AM

Advertising
Advertising
<