ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:23 AM

కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో భారత జట్టు ఈనెలాఖరున శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. ముందుగా పల్లెకెలెలో 26, 27, 29న టీ20 సిరీస్‌.. ఆ తర్వాత కొలంబో వేదికగా ఆగస్టు 1, 4, 7న ఇరు జట్ల మధ్య మూడు

న్యూఢిల్లీ: కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో భారత జట్టు ఈనెలాఖరున శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. ముందుగా పల్లెకెలెలో 26, 27, 29న టీ20 సిరీస్‌.. ఆ తర్వాత కొలంబో వేదికగా ఆగస్టు 1, 4, 7న ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరుగనుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం భారత జట్టు లంకలో పర్యటించింది. మరోవైపు ఈ సిరీ్‌సకు కెప్టెన్‌ రోహిత్‌, విరాట్‌, బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.

టీ20 కెప్టెన్సీకి హసరంగ గుడ్‌ బై: శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్సీనుంచి వనిందు హసరంగ గురువారం వైదొలిగాడు. భారత్‌తో సిరీస్‌ ఆడనున్న తరుణంలో హసరంగ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జట్టు ప్రయోజనాల రీత్యా కెప్టెన్సీ నుంచి వైదొలగి కేవలం ఆటగాడిగా కొనసాగాలని హసరంగ నిర్ణయించుకున్నట్టు శ్రీలంక క్రికెట్‌ తెలిపింది. హసరంగ నాయకత్వంలో ఇటీవలి టీ20 ప్రపంచ కప్‌లో తలపడిన శ్రీలంక సూపర్‌-8 దశకు కూడా చేరని విషయం తెలిసిందే.

Updated Date - Jul 12 , 2024 | 05:24 AM

Advertising
Advertising
<