సఫారీలకు సవాల్
ABN, Publish Date - Jun 19 , 2024 | 04:55 AM
అంచనాలకు భిన్నంగా సాగిన టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశ ముగిసింది. పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలాంటి పటిష్ట జట్లు లేకుండానే నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు సాగనున్నాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2లో నాలుగేసి జట్లు పోటీపడనున్నాయి....
రాత్రి 8 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్,
డీస్నీ హాట్‌స్టార్‌లో..
టీ20వరల్డ్‌కప్
నేడు అమెరికాతో సూపర్-8 మ్యాచ్
నార్త్ సౌండ్: అంచనాలకు భిన్నంగా సాగిన టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశ ముగిసింది. పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలాంటి పటిష్ట జట్లు లేకుండానే నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు సాగనున్నాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2లో నాలుగేసి జట్లు పోటీపడనున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో ఆడాల్సి ఉంటుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. దీనిలోభాగంగా సూపర్-8లో మొదటి మ్యాచ్ గ్రూప్-2లోని దక్షిణాఫ్రికా-యూఎ్‌సఏ మధ్య జరుగబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఆతిథ్య యూఎస్ జట్టు గ్రూప్ దశను దాటగలిగింది. ఎక్కువగా ప్రవాస భారతీయులతో కూడిన ఈ జట్టు కరీబియన్ గడ్డపైనా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ మోనంక్ పటేల్ ఫిట్‌నె్‌సపై స్పష్టత రావాల్సి ఉండగా, ఎప్పటిలాగే పేసర్ నేత్రావల్కర్‌పై భారం పడనుంది.
బౌలింగే బలంగా..: సఫారీలు తమ గ్రూప్ ‘డి’ దశను అజేయంగా ముగించినా ఆశించిన మేర రాణించలేకపోయారు. కేవలం తమ బౌలర్ల ప్రదర్శనతోనే అతికష్టమ్మీద గట్టెక్కారు. బ్యాటర్లు మాత్రం పసికూన జట్లపైనా బెంబేలెత్తిపోయారు. ఒక్కసారి కూడా 120 పరుగుల మార్క్‌ను దాటలేకపోవడం గమనార్హం. నేపాల్‌పై ఆఖరి బంతికి దారుణ పరాభవం నుంచి బతికిపోయారు. ఇక నుంచి పోరు అత్యంత కీలక దశకు చేరిన నేపథ్యంలో తమ ప్రపంచస్థాయి బ్యాటర్ల నుంచి మెరుగైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. డికాక్, హెన్‌డ్రిక్స్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్ మార్‌క్రమ్‌లతో లైనప్ పటిష్టంగా కనిపిస్తున్నా.. క్రీజులో నిలువలేకపోతోంది. తమ గ్రూప్‌లోనే ఇంగ్లండ్, విండీస్ కూడా ఉండడంతో సఫారీ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలోనే బరిలోకి దిగనున్నారు. కానీ బౌలర్లు మాత్రం అద్భుత ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. టోర్నీ ఆరంభానికి ముందు పేసర్ నోకియా ఫామ్‌పై ఆందోళన నెలకొన్నా.. గ్రూప్ దశలో అదరగొట్టాడు. తొమ్మిది వికెట్లతో టోర్నీ సెకండ్ టాపర్‌గా ఉన్నాడు. అటు బార్ట్‌మన్ కూడా జోరు మీదున్నాడు. ఇతర పేసర్లు జాన్సెన్, రబాడ యూఎస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
దక్షిణాఫ్రికా: డికాక్, హెన్‌డ్రిక్స్, మార్‌క్రమ్ (కెప్టెన్), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్/షంసీ, రబాడ, నోకియా, బార్ట్‌మన్.
యూఎ్‌సఏ: స్టీవెన్ టేలర్, మోనంక్ (కెప్టెన్), గౌస్, జోన్స్, నితీశ్ కుమార్, అండర్సన్, హర్మీత్, జస్దీప్, కెనిగె, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్.
పిచ్, వాతావరణం
ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. వర్షం కురిసే అవకాశం 20 శాతమే ఉండడంతో పెద్దగా ఆటంకం ఉండకపోవ చ్చు. టోర్నీలో ఇప్పటిదాకా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. అలాగే చక్కటి బౌన్స్, పేస్ లభించడంతో పేసర్లు కూడా రాణించారు.
Updated Date - Jun 19 , 2024 | 04:55 AM