ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుర్రాళ్లకు సువర్ణావకాశం

ABN, Publish Date - Oct 06 , 2024 | 02:24 AM

ఐపీఎల్‌ సంచలనం, నిలకడగా గంటకు 150కి.మీ వేగంతో బంతులు విసిరే స్పీడ్‌గన్‌ మయాంక్‌ యాదవ్‌ ముంగిట అద్భుత అవకాశం. మరో పేసర్‌ హర్షిత్‌ రాణాతో పాటు ఆంధ్రకు చెందిన యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి తమ...

నేటి నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌

రాత్రి. 7 గం నుంచి, జియో సినిమాలో

మయాంక్‌, హర్షిత్‌, నితీశ్‌లపై దృష్టి

  • జోష్‌లో యువ భారత్‌

  • గాయంతో దూబే దూరం

గ్వాలియర్‌: ఐపీఎల్‌ సంచలనం, నిలకడగా గంటకు 150కి.మీ వేగంతో బంతులు విసిరే స్పీడ్‌గన్‌ మయాంక్‌ యాదవ్‌ ముంగిట అద్భుత అవకాశం. మరో పేసర్‌ హర్షిత్‌ రాణాతో పాటు ఆంధ్రకు చెందిన యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన వేదిక లభించినట్టే. టీ20 వరల్డ్‌ చాంపియన్‌ అయ్యాక సీనియర్లు లేకుండానే భారత్‌ బరిలోకి దిగుతోంది. సూ ర్యకుమార్‌ నేతృత్వంలోని ఈ టీమ్‌ ఆదివారం నుం చే బంగ్లాతో సిరీ్‌సను ఆరంభించనుంది. అందివచ్చి న చాన్స్‌ను ఒడిసిపట్టుకుని జాతీయ జట్టులో స్థా నం సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనలో కుర్రాళ్లున్నా రు. అటు టెస్టు సిరీ్‌సను 0-2తో కోల్పోయిన పర్యాటక బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్‌లో సత్తా చూపాలనుకుంటోంది. అనుభవంలేని ఆతిథ్య జట్టును దెబ్బతీసి సిరీస్‌ దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది.


దూబే స్థానంలో తిలక్‌: బంగ్లాతో సిరీస్‌ ఆరంభానికి ముందే జట్టుకు ఝలక్‌ తగిలింది. ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే వెన్నునొప్పితో వైదొలిగాడు. అతడి స్థానంలో మరో తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మను ఎంపిక చేయగా.. ఆదివారం ఉదయం అతను జట్టుతో చేరనున్నాడు. అయితే తిలక్‌ను నేరుగా తుది జట్టులో ఎంపిక చేస్తారా? లేక మరో ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌తో అరంగేట్రం చేయిస్తారా? వేచి చూడాల్సిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో బుల్లెట్‌ వేగంతో బంతులను సంధించిన మయాంక్‌ యాదవ్‌ను అంత సులువుగా మర్చిపోలేరు. కానీ గాయంతో అతడు కొన్ని మ్యాచ్‌లకే పరిమితం కావాల్సివచ్చింది. ఇప్పుడు బంగ్లాతో సిరీస్‌ అతడి ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని చాటిచెప్పనుంది.

షకీబ్‌ లేకుండానే..: బంగ్లా జట్టు ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ లేకుండానే ఇక టీ20లు ఆడాల్సి ఉంది. తాజా టీమ్‌లో ఎక్కువ మంది టెస్టు సిరీ్‌సలో ఆడని ప్లేయర్లే ఉండడంతో వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదు. 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్‌లో స్పిన్నర్‌ మిరాజ్‌ ఆడనున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ షంటో, లిట్టన్‌ దాస్‌ కీలకం కానున్నారు.


తుది జట్లు: (అంచనా)

భారత్‌: సంజూ శాంసన్‌, అభిషేక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), పరాగ్‌, తిలక్‌/నితీశ్‌ కుమార్‌, హార్దిక్‌, రింకూ సింగ్‌, సుందర్‌, బిష్ణోయ్‌, మయాంక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

బంగ్లాదేశ్‌: లిట్టన్‌, పర్వేజ్‌, తన్జీద్‌ హసన్‌, షంటో (కెప్టెన్‌), మిరాజ్‌, తౌహీద్‌ హ్రిదయ్‌, మహ్ముదుల్లా, రిషాద్‌ హొస్సేన్‌, తన్జీమ్‌ హసన్‌, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌.

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో ఆట

వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సచిన్‌ 2010లో చరిత్ర సృష్టించిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అతడా రికార్డు సాధించింది గ్వాలియర్‌ మైదానంలోనే.. అయితే అప్పటి నుంచి నేటి వరకు అంటే 14 ఏళ్ల పాటు ఈ సిటీలో మరో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగకపోవడం గమనార్హం. తాజాగా ఇక్కడ మాధవ్‌రావ్‌ సింధియా పేరిట మరో స్టేడియాన్ని నిర్మించారు. నేడు బంగ్లాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఈ మైదానం అంతర్జాతీయ క్రికెట్‌కు మొదటిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది.

Updated Date - Oct 06 , 2024 | 02:24 AM