గోవా కుర్రాళ్ల చరిత్ర
ABN, Publish Date - Nov 15 , 2024 | 02:52 AM
గోవా ఆటగాళ్లు స్నేహల్ కౌతాంకర్ (215 బంతుల్లో 314 నాటౌట్), కశ్యప్ బక్లే (269 బంతుల్లో 300 నాటౌట్) త్రిశతకాలతోపాటు 90 ఏళ్ల రంజీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పా రు. దీంతో ప్లేట్‌గ్రూ్‌పలో అరుణాచల్‌పై గోవా...
రంజీల్లో 606 పరుగుల భాగస్వామ్యం
పోర్వోరిమ్ (గోవా): గోవా ఆటగాళ్లు స్నేహల్ కౌతాంకర్ (215 బంతుల్లో 314 నాటౌట్), కశ్యప్ బక్లే (269 బంతుల్లో 300 నాటౌట్) త్రిశతకాలతోపాటు 90 ఏళ్ల రంజీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పా రు. దీంతో ప్లేట్‌గ్రూ్‌పలో అరుణాచల్‌పై గోవా ఇన్నింగ్స్ 551 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మూడో వికెట్‌కు స్నేహల్, కశ్యప్ ఏకంగా 606 పరుగులు చేసి రంజీ చ రిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో గోవా తొలి ఇన్నింగ్స్‌ను 92 ఓవర్లలో 727/2 వద్ద డిక్లేర్ చేసింది. ప్లేట్ డివిజన్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. అరుణాచల్ తొలి ఇన్నింగ్స్‌లో 84, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించింది. 2016లో ఢిల్లీతో మ్యాచ్‌లో మ హారాష్ట్ర ప్లేయర్లు ఎస్‌ఎం గుగాలె, ఏఆర్ బావ్నే మూడో వికెట్‌కు 594 పరుగుల భాగస్వామ్య రికార్డును స్నేహ ల్, కశ్యప్ బద్దలు కొట్టారు.
అంతేకాకుండా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు ట్రిపుల్ సెంచరీలు చేయడం రం జీ చరిత్రలో ఇది రెండోసారి. ఇక ఫస్ట్‌క్లాస్ కిక్రెట్‌లో శ్రీలంక ఆటగాళ్లు సంగక్కర-మహేల జయవర్దనె సా ధించిన 624 పరుగుల (2006లో దక్షిణాఫ్రికాతో టెస్టు) భాగస్వామ్యం తర్వాత ఇదే అత్యధికం. మనోళ్లు మరో 19 పరుగులు చేసివుంటే ప్రపంచరికార్డు బద్దలైవుండేది.
Updated Date - Nov 15 , 2024 | 02:52 AM