స్వియటెక్‌కు షాక్
ABN, Publish Date - Sep 06 , 2024 | 01:26 AM
ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సంచలనరీతిలో సాగుతోంది. అదరగొడతారనుకున్న స్టార్లంతా ఆరంభం నుంచే అనూహ్య రీతిలో వెనుదిరుగుతున్నారు. తాజాగా వరల్డ్ నెంబర్‌వన్ ఇగా స్వియటెక్ (పోలెండ్) కూడా అదే జాబితాలో...
పెగులా చేతిలో చిత్తు
సెమీ్‌సలో సినర్
యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సంచలనరీతిలో సాగుతోంది. అదరగొడతారనుకున్న స్టార్లంతా ఆరంభం నుంచే అనూహ్య రీతిలో వెనుదిరుగుతున్నారు. తాజాగా వరల్డ్ నెంబర్‌వన్ ఇగా స్వియటెక్ (పోలెండ్) కూడా అదే జాబితాలో చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ మాజీ చాంపియన్ 2-6, 4-6 తేడాతో ఆరో సీడ్ జెస్సికా పెగులా (యూఎస్‌ఏ) చేతిలో చిత్తుగా ఓడింది. గతంలో పెగులా ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్‌కు చేరినా ఒక్కసారి కూడా గెలువలేకపోయింది. ఈసారి మాత్రం సంపూర్ణ ఆధిపత్యంతో కెరీర్‌లో తొలిసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. అటు స్వియటెక్ మాత్రం పేలవ సర్వీస్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో మూల్యం చెల్లించుకుంది. ఏకంగా 41 అనవసర తప్పిదాలకు పాల్పడింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన తను ఓ దశలో రాకెట్‌ను నెట్‌పైన కొట్టింది. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేయగలిగింది.
మరో క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ మచోవా 6-1, 6-4 తేడాతో బియాట్రిజ్ హడ్డడ్ (బ్రెజిల్)పై గెలిచి ఈ గ్రాండ్‌స్లామ్‌లో వరుసగా రెండోసారి సెమీ్‌సకు చేరింది. శుక్రవారం నాటి సెమీ్‌సలో మచోవ-పెగులా, సబలెంక (బెలార్‌స)-ఎమ్మా నవారో (యూఎ్‌సఏ) తలపడనున్నారు.
సినర్ సెమీ్‌సకు..: పురుషుల సింగిల్స్‌లో జానిక్ సినర్ ‘టాప్’ షో కొనసాగుతోంది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో మెద్వెదెవ్ (రష్యా)పై 6-2, 1-6, 6-1, 6-4 తేడాతో గెలిచి సెమీ్‌సలో అడుగుపెట్టాడు. తాజా గ్రాండ్‌స్లామ్‌లో సినర్ కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోయాడు. శనివారం జరిగే సెమీ్‌సలో సినర్-జాక్ డ్రేపర్ (బ్రిటన్), ఫ్రాన్స్ ద్వయం టేలర్ ఫ్రిట్జ్-ఫ్రాన్సెస్ టియాఫో తలపడనున్నారు.
Updated Date - Sep 06 , 2024 | 01:26 AM