ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌కు ‘సూపర్‌’ విజయం

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:40 AM

నామమాత్రపు మ్యాచే అయినా.. సిరీ్‌సలో ఆఖరి పోరు అభిమానులను ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు చేసిందే 137 పరుగులు. ఈ స్వల్ప ఛేదనలో ఆపసోపాలు పడిన శ్రీలంక చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు చేయలేక మ్యాచ్‌ను

3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

స్వల్ప ఛేదనలో లంక తడబాటు

పల్లెకెలె: నామమాత్రపు మ్యాచే అయినా.. సిరీ్‌సలో ఆఖరి పోరు అభిమానులను ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు చేసిందే 137 పరుగులు. ఈ స్వల్ప ఛేదనలో ఆపసోపాలు పడిన శ్రీలంక చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు చేయలేక మ్యాచ్‌ను టై చేసుకుంది. 19వ ఓవర్‌లో రింకూ, 20వ ఓవర్‌లో సూర్య రెండేసి వికెట్లతో అబ్బురపరిచారు. ఇక సూపర్‌ ఓవర్‌లో మరీ దారుణంగా లంక మూడు బంతులే ఆడి 2/2తో భారత్‌కు బ్యాటింగ్‌ను అప్పగించింది. అటు తొలి బంతినే ఫోర్‌గా మలిచిన సూర్య మ్యాచ్‌ను ముగించాడు. అలాగే సిరీ్‌సను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. లంక స్పిన్నర్ల ధాటికి 48/5 స్కోరుతో ఇబ్బందిపడిన వేళ.. గిల్‌ (39), పరాగ్‌ (26) ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. చివర్లో సుందర్‌ (25) వేగంగా ఆడాడు. తీక్షణకు మూడు, హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసింది. కుశాల్‌ పెరీర (46), కుశాల్‌ మెండిస్‌ (43) మాత్రమే రాణించారు. సుందర్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వాషింగ్టన్‌ సుందర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా సూర్యకుమార్‌ నిలిచారు.

సంక్షిప్త స్కోర్లు: భారత్‌: 20 ఓవర్లలో 137/9 (గిల్‌ 39, పరాగ్‌ 26, సుందర్‌ 25; తీక్షణ 3/28, హసరంగ 2/29).

శ్రీలంక: 20 ఓవర్లలో 137/8. (పెరీర 46, కుశాల్‌ మెండిస్‌ 43; సుందర్‌ 2/23, బిష్ణోయ్‌ 2/38).

Updated Date - Jul 31 , 2024 | 06:40 AM

Advertising
Advertising
<