ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: రోహిత్ తన విలువేంటో చాటి చెప్పాడు.. టీమిండియా కెప్టెన్‌పై గిల్‌క్రిస్ట్ ప్రశంసలు!

ABN, Publish Date - Jun 26 , 2024 | 03:27 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ అక్తర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా రోహిత్‌ను ప్రశంసించాడు.

Adam Gilchrist praises Rohit Sharma

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో భాగంగా ఆస్ట్రేలియాపై కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ అక్తర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) కూడా రోహిత్‌ను ప్రశంసించాడు. రోహిత్ తన దూకుడు రేంజ్‌ ఎలా ఉంటుందో చూపించాడని కొనియాడాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్ ఎంతో మంది నోళ్లు మూయించాడని, తన విలువేంటో చాటి చెప్పాడని గిల్‌క్రిస్ట్ అన్నాడు (India vs Australia).


``ఆస్ట్రేలియాపై రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. దూకుడుగా ఆడతామని బయట చెప్పిన మాటలను మైదానంలో కొనసాగించాడు. కెప్టెన్ అలాంటి ఇన్నింగ్స్ ఆడినపుడు జట్టు మొత్తంపై సానుకూల ప్రభావం పడుతుంది. యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఐపీఎల్‌లో రోహిత్ ప్రదర్శనపై చాలా మంది కామెంట్లు చేశారు. ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్ వాళ్లందరి నోళ్లూ మూయించాడు. జట్టులో తన విలువేంటో చాటి చెప్పాడు. బౌలర్లపై ఎప్పుడు ఆధిపత్యం ప్రదర్శించాలో రోహిత్‌కు బాగా తెలుసు`` అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.


ఆస్ట్రేలియాపై ఘన విజయంతో టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ (T20 Worldcup Semi final) చేరుకున్న టీమిండియా గురువారం సాయంత్రం ఇంగ్లండ్‌తో (India vs England) తలపడనుంది. తొలి సెమీస్ మ్యాచ్ గురువారం ఉదయం అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోతోంది. కాగా, ఆఫ్గాన్‌పై సెమీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే కచ్చితంగా ఈ టోర్నీని గెలుచుకుంటుందని ఆస్ట్రేలియాకు చెందిన మరో మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

T20 World Cup: బాల్ టాంపరింగ్‌ ఆరోపణలు.. అర్షదీప్ సింగ్ అదెలా చేశాడు?


David Warner: డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2024 | 03:27 PM

Advertising
Advertising