Babar Azam: పాకిస్తాన్ టీమ్‌ను తన స్నేహితులతో నింపేశాడు.. ఫ్యాన్స్‌ను మోసం చేశాడు.. బాబర్ ఆజామ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం!
ABN, Publish Date - Jun 12 , 2024 | 12:46 PM
బాబర్ ఆజామ్ పాకిస్తాన్ కెప్టెన్ అయినప్పటి నుంచే ఆ జట్టుకు కష్టాలు మొదలయ్యాయని, సాధారణ టీమ్‌లపై కూడా పాకిస్తాన్ ఓడిపోతోందని ఆ జట్టు మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటములకు పూర్తిగా బాబరే కారణమని వ్యాఖ్యానించాడు.
బాబర్ ఆజామ్ (Babar Azam) పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్ అయినప్పటి నుంచే ఆ జట్టుకు కష్టాలు మొదలయ్యాయని, సాధారణ టీమ్‌లపై కూడా పాకిస్తాన్ ఓడిపోతోందని ఆ జట్టు మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటములకు పూర్తిగా బాబరే కారణమని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులను, దేశాన్ని బాబర్ మోసం చేస్తున్నాడని షెహజాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు నాశనం కావడానికి బాబర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
``బాబర్ కెప్టెన్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కష్టాలు ఎదుర్కొంటోంది. సాధారణ జట్లపై కూడా ఓడిపోతోంది. ఈ వ్యాఖ్యలు చేయడం నాకు బాధగానే ఉంది. కానీ, తప్పడం లేదు. ప్రస్తుత జట్టును చూస్తుంటే అలాగే ఉంది. కనీసం 120 పరుగులను ఛేదించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. జట్టు కెప్టెన్‌గా, ఆటగాడిగా బాబర్ తీవ్రంగా విఫలమవుతున్నాడు. అతడు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే జట్టును నాశనం చేస్తున్నాయ``ని షెహజాద్ అన్నాడు.
``ప్రస్తుతం టీమ్‌లో ఉన్న స్టార్లు అందరూ చిన్న టీమ్‌లపైనే చెలరేగుతారు. భారత్ వంటి ప్రత్యర్థి ఎదురైతే ఏమీ చేయలేరు. తన నిర్ణయాలతో బాబర్ దేశ క్రికెట్ ప్రేమికులను మోసం చేస్తున్నాడు. తనకు నచ్చిన వాళ్లు, స్నేహితులతో టీమ్‌ను నింపేస్తున్నాడు. ట్యాలెంట్ లేని వాళ్లు మ్యాచ్‌లను ఎలా గెలిపించగలరు. మరోవైపు బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఘోరంగా విఫలమవుతున్నాడు. అతడి సగటు కేవలం 27 మాత్రమేన``ని షెహజాద్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Pakistan: ఆ ప్లేయర్లు జట్టులో ఉంటే.. పాకిస్తాన్ ఎప్పటికీ గెలవదు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 12 , 2024 | 12:46 PM