క్లీన్‌స్వీ్‌ప లక్ష్యంగా..
ABN, Publish Date - Jul 30 , 2024 | 01:27 AM
కొత్త నాయకత్వంలో టీమిండియా ఆశించిన రీతిలోనే సాగుతోంది. శ్రీలంకతో వరుసగా రెండు టీ20లను ఖాతాలో వేసుకున్న భారత్ నేడు ఆఖరిదైన మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. 2-0తో
నేడు లంకతో భారత్ మూడో టీ20
పల్లెకెలె: కొత్త నాయకత్వంలో టీమిండియా ఆశించిన రీతిలోనే సాగుతోంది. శ్రీలంకతో వరుసగా రెండు టీ20లను ఖాతాలో వేసుకున్న భారత్ నేడు ఆఖరిదైన మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. 2-0తో ఇప్పటికే సిరీస్ వశమైనప్పటికీ లంకను క్లీన్‌స్వీ్‌ప చేయాలన్న లక్ష్యంతో ఉంది. చివరి మ్యాచ్‌లోనూ పైచేయి సాధించి సూర్యకుమార్ తన ఫుల్ టైమ్ కెప్టెన్సీ అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో శాంసన్, పరాగ్, రింకూ సింగ్‌లకు మరింత ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటోంది. అలాగే అర్ష్‌దీ్‌పనకు విశ్రాంతినిచ్చి ఖలీల్‌ను ఆడించే చాన్స్ ఉంది. మరోవైపు శ్రీలంక బ్యాటింగ్‌లో టాపార్డర్ మినహా అంతా విఫలమవుతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆ జట్టు తమ లోపాలను సరిచేసుకుంటే ఓదార్పు విజయం దక్కుతుంది.
శ్రీలంక చేరిన రోహిత్, విరాట్ : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శ్రీలంక చేరుకున్నారు. వచ్చేనెల రెండు నుంచి శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీ్‌సలో పాల్గొనేందుకు వారిద్దరు ఇక్కడకు విచ్చేశారు. రోహిత్, కోహ్లీతోపాటు వచ్చిన వన్డే జట్టు సభ్యులు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా సోమవారం ఇక్కడ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కాగా..ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్, విరాట్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విషయం విదితమే.
Updated Date - Jul 30 , 2024 | 01:27 AM