ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik Pandya: అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదు.. వివరణ ఇచ్చిన అజిత్ అగార్కర్!

ABN, Publish Date - Jul 22 , 2024 | 11:22 AM

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు సెలక్షన్ కమిటీ తాజాగా షాకిచ్చింది. శ్రీలంకలో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లకు వైస్-కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది

Ajit agarkar

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో టీమిండియాకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు సెలక్షన్ కమిటీ తాజాగా షాకిచ్చింది. శ్రీలంకలో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లకు వైస్-కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తారని అందరూ అనుకున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.


శ్రీలంక టూర్‌కు పయనమవుతున్న నేపథ్యంలో కొత్త కోచ్ గంభీర్‌ (Gautam Gambhir)తో పాటు ఛీప్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ (Ajit agarkar) కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోవడంపై వివరణ ఇచ్చాడు. ``హార్దిక్ పాండ్యా జట్టులో అత్యంత కీలక ప్లేయర్. అతడి నైపుణ్యంపై మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అయితే అన్ని మ్యాచ్‌లకూ హార్దిక్ అందబాటులో ఉండగలడా? లేడా? అనే సందేహం మాకు ఉంది. ఫిట్‌నెస్ విషయంలో హార్దిక్‌కు కొన్ని సమస్యలు ఉన్నాయి`` అని అగార్కర్ వెల్లడించాడు.


మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో సూర్యకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కోచ్ గంభీర్‌తో కలిసి నిర్ణయించుకున్నామని, సారథిగా సూర్యకుమార్ విజయవంతం అవుతాడనే నమ్మకం ఉందని అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి..

Gautam Gambhir: పంతం నెగ్గిన గౌతమ్ గంభీర్.. మనోడికి మొండిచెయ్యి


Ruturaj Gaikwad: బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉంటేనే టీమిండియాలో చోటు.. సీఎస్కే మాజీ ఆటగాడి ఘాటు విమర్శలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 11:22 AM

Advertising
Advertising
<