ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: పారిస్‌లో సత్తా చాటిన అమెరికా.. పతకాల వేటలో చైనాను వెనక్కి నెట్టిన అగ్రరాజ్యం!

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:50 AM

ప్రపంచ క్రీడల సంరంభం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడాభిమానులను మురిపించారు. ఈ ఒలింపిక్స్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే అమెరికా అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

America olympic medals in paris 2024

ప్రపంచ క్రీడల సంరంభం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడాభిమానులను మురిపించారు. ఈ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో ఓవరాల్‌గా చూసుకుంటే అమెరికా (USA) అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (China)తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన పోటీలో చివరకు పై చేయి సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికా, చైనా చెరో 40 పతకాలు సాధించినప్పటికీ, మొత్తం పతకాల విషయంలో మాత్రం చైనాకు అందనంత ఎత్తులో అమెరికా (America Medals) ఉంది. దీంతో చైనా (China Medals) రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు.


నిజానికి ఒలింపిక్స్‌లో ఎవరు ఎక్కువ స్వర్ణాలు సాధిస్తే వారే మెడల్ టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నట్టు భావిస్తారు. దీంతో చివరి రెండ్రోజుల్లో చైనా, అమెరికా మధ్య గట్టి పోటీ నెలకొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రమే అమెరికాపై చైనా పైచేయి సాధించగలిగింది. ఫ్రాన్స్‌లో ఆ ఫీట్ రిపీట్ చేయాలని చైనా క్రీడాకారులు గట్టి పట్టుదలతో పోరాడారు. టేబుల్ టెన్నిస్‌లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా అమెరికాను చైనా దాటేసింది. అయితే చివరి రెండ్రోజుల్లో అమెరికా పుంజుకుంది. బాస్కెట్‌బాల్‌లో పురుషులు, మహిళలు సత్తా చాటి స్వర్ణాలు దక్కించుకున్నారు. ఇక, చివరి రోజైన ఆదివారం ఈ పోటీ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది.


బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన చైనా తన స్వర్ణాల సంఖ్యను 40కి పెంచుకుంది. అమెరికా 39 దగ్గరే ఆగిపోయింది. దీంతో మహిళల జట్టు ఫ్రాన్స్‌తో ఆడాల్సిన బాస్కెట్ బాల్ పోటీ మీదే యూఎస్ ఆశలు పెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ పలుసార్లు పై చేయి సాధించింది. కానీ, అమెరికా జట్టు గొప్పగా పోరాడి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. దీంతో అమెరికా కూడా 40 స్వర్ణాలు సాధించింది. అయితే 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలతో మొత్తం 126 పతకాలు సాధించి అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్యాలతో మొత్తం 91 పతకాలు సాధించి చైనా రెండో స్థానానికి పరమితమైంది.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: నీరజ్ చోప్రా తల్లి నాకూ తల్లిలాంటిదే.. పాకిస్తాన్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్ కామెంట్స్!


Paris Olympics 2024: వారానికే రంగు కోల్పోతున్న ఒలింపిక్ మెడల్స్.. సంచలన విషయం బయటపెట్టిన అథ్లెట్!


Paris Olympics 2024: నేటితో ఒలింపిక్స్ వేడుకలు ముగింపు.. నెక్స్ట్ ఎక్కడంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2024 | 09:42 AM

Advertising
Advertising
<