ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక గంభీర్‌ శకం

ABN, Publish Date - Jul 10 , 2024 | 02:49 AM

భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియామకాన్ని భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశాడు. టీ20 వరల్డ్‌క్‌పతో....

టీమిండియా కోచ్‌గా నియామకం

  • ప్రకటించిన బీసీసీఐ

  • శ్రీలంక టూర్‌తో ఇన్నింగ్స్‌ షురూ

న్యూఢిల్లీ: భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియామకాన్ని భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశాడు. టీ20 వరల్డ్‌క్‌పతో ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది. శ్రీలంకతో ఈ నెల 27నుంచి జరిగే సిరీస్‌ నుంచి కోచ్‌గా ప్రయాణం ఆరంభించనున్న గంభీర్‌ రెండేళ్లపాటు పదవిలో ఉంటాడు. ఈ సిరీ్‌సలో భారత జట్టు మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది. 42 ఏళ్ల గౌతీకి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా పలు ఐపీఎల్‌ జట్లకు మెంటార్‌గా సేవలందించాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ‘భారత దేశమే నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం ఈ జన్మకు దక్కిన గొప్ప గౌరవం. కొత్త పాత్రలో టీమిండియాతో మమేకవుతున్నా. కానీ, నా లక్ష్యం మాత్రం ఒక్కటే.. భారత్‌ను గర్వించేలా చేయడం. ప్రజల కలలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాన’ని గంభీర్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు. కాగా ద్రవిడ్‌ పదవీకాలం ఇటీవలి వరల్డ్‌క్‌పతోనే ముగిసిన విషయం తెలిసిందే.


గంభీర్‌ ఎంపిక ఆలస్యమైనందున జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించారు. గంభీర్‌ తన కెరీర్‌లో 2007 టీ20 వరల్డ్‌కప్‌, తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌ గెల్చుకున్న భారత జట్టులో సభ్యుడు. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కోల్‌కతా జట్టును రెండుసార్లు (2012, 2014) విజేతగా నిలిపాడు. గంభీర్‌ వేతనం ఎంతనేది బోర్డు వెల్లడించనప్పటికీ ఏడాదికి సుమారు 10 నుంచి 12 కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు.

సవాళ్లపై సవారీ

టీమిండియా సంధి దశలో ఉన్న కీలక సమయంలో గంభీర్‌ జట్టు కోచింగ్‌ బాధ్యతలు అందుకొంటున్నాడు. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. వారి లోటును భర్తీ చేయడం గంభీర్‌కు ఇప్పుడు పెనుసవాల్‌గా మారనుంది.

Updated Date - Jul 10 , 2024 | 02:50 AM

Advertising
Advertising
<