అర్జున్, హంపి, హారిక గేమ్‌లు డ్రా
ABN, Publish Date - Nov 14 , 2024 | 02:56 AM
తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో తొలిరోజు జరిగిన ర్యాపిడ్ విభాగం మూడు రౌండ్లను డ్రాగా ముగించాడు....
టాటా స్టీల్ చెస్
కోల్‌కతా: తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో తొలిరోజు జరిగిన ర్యాపిడ్ విభాగం మూడు రౌండ్లను డ్రాగా ముగించాడు. బుధవారం ఇక్కడ మొదలైన ఓపెన్ కేటగిరిలో నిహాల్ సరీన్‌తో ఆరంభ రౌండ్‌ను, ఆ తర్వాత విదిత్, నారాయణన్‌లతో గేమ్‌లను అర్జున్ డ్రా చేసుకున్నాడు. 3 రౌండ్ల అనంతరం అర్జున్ 1.5 పాయింట్లతో ఏడోస్థానంలో ఉన్నాడు. ఇక.. మహిళల విభాగంలో హంపి, హారిక తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. మూడు రౌండ్లలోనూ తమ ప్రత్యర్థులతో పాయింట్ పంచుకున్నారు. తద్వారా మొదటి రోజు పోటీల తర్వాత హంపి, హారిక చెరో 1.5 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Updated Date - Nov 14 , 2024 | 02:56 AM