Marnus Labuschange: వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌కు రిటైర్మెంట్.. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబూషేన్ విచారం..!
ABN, Publish Date - Aug 13 , 2024 | 10:37 AM
గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతీయులకు ఎంతో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పైనల్‌కు చేరిన రోహిత్ సేన కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు.
గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ODI Worldcup)మ్యాచ్ భారతీయులకు ఎంతో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పైనల్‌కు చేరిన రోహిత్ సేన కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో (Final Match) టీమిండియాను ఆస్ట్రేలియా నిలువరించింది (India vs Australia). భారత్‌పై విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి ట్రావిస్ హెడ్, మార్నస్ లబూసేన్ (Marnus Labuschagne) భాగస్వామ్యమే కారణం.
ఆ మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 47 పరుగులకే మూడు కీలక వికెట్లు పోగొట్టుకుంది. అయితే ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు మార్నస్ లబూషేన్ జత కలవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు టర్న్ అయింది. హెడ్ సెంచరీ చేయగా, లబూషేన్ 110 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడడానికి తను ఉపయోగించిన బ్యాట్ తాజాగా దెబ్బతిందని లబూషేన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
దెబ్బతిన్న బ్యాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలోని బ్యాట్ పాక్షికంగా దెబ్బతింది. బ్యాటు అడుగు భాగంలోని పై పొర కొంత ఊడివచ్చింది. దాంతో ఆ బ్యాట్‌కు లబూషేన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ బ్యాట్‌తో ఆడిన మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో లబూషేన్ 40.22 సగటుతో 362 రన్స్ కొట్టాడు. లబూషేన్ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ బ్యాట్‌ను తమ మ్యూజియంకు ఇవ్వాలని ఒకరు అడిగారు.
ఇవి కూడా చదవండి..
Neeraj Chopra - Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమ వివాహం? మను తండ్రి స్పందన ఏంటంటే..
Neeraj Chopra: వాచ్ గురించే చర్చ..!!
Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 13 , 2024 | 10:37 AM