ఆస్ట్రేలియా ఘనవిజయం
ABN, Publish Date - Oct 09 , 2024 | 06:08 AM
న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆస్ర్టేలియా 60 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు
మహిళల టీ20 వరల్డ్‌కప్
షార్జా: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆస్ర్టేలియా 60 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎలిస్ పెర్రీ (30), హీలీ (26) రాణించారు. అమెలియా కెర్‌కు నాలుగు.. హల్లీడే, మెయిర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ను పేసర్ మెగాన్ షుట్ (3/3) వణికించింది. దీంతో ఈ జట్టు 19.2 ఓవర్లలో 88 పరుగులకు కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మెగాన్ షుట్ నిలిచింది.
Updated Date - Oct 09 , 2024 | 06:08 AM