India vs Pakistan: పాకిస్తాన్ కెప్టెన్ చెత్త రికార్డు.. ఎవరూ కోరుకోని ఘనతను సొంతం చేసుకున్న బాబర్ ఆజమ్!
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:50 PM
పసికూన అనుకున్న అమెరికాతో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. టీ20 ప్రపంచ కప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్ క్రికెట్‌లో కలకలం సృష్టించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
పసికూన అనుకున్న అమెరికాతో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి (Pakistan vs America). టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024)లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్ క్రికెట్‌లో కలకలం సృష్టించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam)పై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా బాబర్ నియంతృత్వ వైఖరి జట్టులో చీలికకు కారణమైందని వార్తలు వస్తున్నాయి. ఇతరులను పట్టించుకోకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారట (Babar Azam Worst record).
కాగా, పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏ దేశ నాయకుడూ కోరుకోని రికార్డు బాబర్ దక్కించుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో పసికూనలుగా భావించే అమెరికా, జింబాబ్వే, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిన పాక్ కెప్టెన్‌గా నిలిచాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌తో ఓడింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో ఓటమి పాలైంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడింది.
తాజా ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో ఓటమిపాలైంది. ఇలా నాలుగు చిన్న జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఓడిన అగ్ర జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. కాగా, గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌తో ఓటమి ఎదురైన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ పదవికి బాబర్ రాజీనామా చేశాడు. అతడి రాజీనామాను అంగీకరించిన బోర్డు షాహీన్ ఆఫ్రీదిని కెప్టెన్‌గా నియమించింది. అయితే అతడి కెప్టెన్సీలో పాక్ మరింత ఘోర పరాజయాలను ఎదుర్కోవడంతో తిరిగి బాబర్ ఆజామ్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ‘పోరాటం’ కాదు.. ఓ చరిత్ర!
Virat Kohli: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్ ఆటగాడు..ఇక రోహిత్ శర్మ..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2024 | 03:50 PM