India vs England: స్పిన్నర్ అశ్విన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ
ABN, Publish Date - Feb 18 , 2024 | 11:07 AM
తల్లి అనారోగ్యం కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్లిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మూడో టెస్టు నాలుగవ రోజున అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని క్లారిటీ ఇచ్చింది. అంటే నేడు (ఆదివారం) జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
రాజ్‌కోట్: తల్లి అనారోగ్యం కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్లిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మూడో టెస్టు నాలుగవ రోజున అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని క్లారిటీ ఇచ్చింది. అంటే నేడు (ఆదివారం) జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ‘‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా మూడవ రోజు గైర్హాజరైన అశ్విన్‌ను తిరిగి జట్టుతో కలనున్నాడని సంతోషంగా ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొంది. కాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్ 2వ రోజున అశ్విన్ అత్యవసర పరిస్థితుల్లో బయలుదేరి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
కాగా అత్యవసర పరిస్థితుల్లో అశ్విన్ ఇంటికి వెళ్లడం పట్ల ఆటగాళ్లు, మీడియా, అభిమానులు అందరూ అపారమైన అవగాహనతో వ్యవహరించడం పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ హర్షం వ్యక్తం చేసింది. కుటుంబ ప్రాధాన్యతను గుర్తిస్తున్నామని పేర్కొంది. ఈ కష్టసమయంలో టీమ్, ఇతరులు అశ్విన్‌కు మద్దతు తెలిపారని, అశ్విన్‌ను తిరిగి మైదానంలోకి స్వాగతించడం పట్ల ఆనందంగా ఉన్నామని ఒక ప్రకటనలో పేర్కొంది.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా పట్టు బిగిస్తోంది. ఆట నాలుగవ రోజు 73 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 265 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (123), సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు.
Updated Date - Feb 18 , 2024 | 11:10 AM