గైక్వాడ్‌కు అండగా బీసీసీఐ

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:25 AM

బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ (71)కు బీసీసీఐ అండగా నిలిచింది. అతడి వైద్య ఖర్చుల కోసం రూ.కోటి ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు...

గైక్వాడ్‌కు అండగా బీసీసీఐ

రూ.కోటి ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ: బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ (71)కు బీసీసీఐ అండగా నిలిచింది. అతడి వైద్య ఖర్చుల కోసం రూ.కోటి ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రకటించింది. అంతకుముందు గైక్వాడ్‌ చికిత్స కోసం బోర్డు ఆర్థిక సహాయం చేయాలంటూ కపిల్‌దేవ్‌ సహా మాజీ క్రికెటర్ల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీంతో బోర్డు వెంటనే స్పందించింది. ఏడాది కాలంగా గైక్వాడ్‌ లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అతని మాజీ సహచరులు ఇప్పటికే నిధులు సేకరించి తోడ్పడుతుండగా.. బోర్డు కూడా ముందుకు రావాలని కపిల్‌ డిమాండ్‌ చేశాడు.

Updated Date - Jul 15 , 2024 | 05:25 AM

Advertising
Advertising
<