Gymnastics : భళా..బైల్స్
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:17 AM
అమెరికన్ సూపర్ స్టార్ సిమోన్ బైల్స్ అదరగొట్టింది. అంచనాలను నిలబెట్టుకొంటూ మహిళల జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో బైల్స్ మొత్తం 59.131 పాయింట్లతో
అమెరికా స్టార్‌కు ‘ఆల్‌రౌండ్’ స్వర్ణం
అమెరికన్ సూపర్ స్టార్ సిమోన్ బైల్స్ అదరగొట్టింది. అంచనాలను నిలబెట్టుకొంటూ మహిళల జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో బైల్స్ మొత్తం 59.131 పాయింట్లతో విజేతగా నిలిచింది. తద్వారా 1964లో వెరా కస్లావస్కా తర్వాత ఒలింపిక్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో రెండు పసిడి పతకాలు సొంతం చేసుకున్న తొలి జిమ్నా్‌స్టగా బైల్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఈసారి క్రీడల్లో బైల్స్‌కిది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇంతకుముందు ఆర్టిస్టిక్ టీమ్ విభాగంలో అమెరికా జట్టు స్వర్ణ పతకం అందుకొన్న సంగతి తెలిసిందే. ఇక..ఆల్‌రౌండ్ ఫైనల్లో రెబెకా అండ్రాడే (బ్రెజిల్, 57.932) రజతం, ఈ విభాగంలో ప్రస్తుత చాంపియన్, అమెరికాకే చెందిన సునిసా లీ (56.465) కాంస్య పతకం దక్కించుకున్నారు.
Updated Date - Aug 02 , 2024 | 04:17 AM