రాళ్లను మోస్తూ.. పర్వతాలు ఎక్కుతూ
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:33 AM
టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు అత్యంత తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తూ కొండలు, గుట్టలు ఎక్కుతోంది...
ఆర్మీ పర్యవేక్షణలో పాక్ జట్టు సాధన
కరాచీ: టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు అత్యంత తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తూ కొండలు, గుట్టలు ఎక్కుతోంది. అబోటాబాద్‌లోని ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ స్కూల్ అధికారుల పర్యవేక్షణలో 29 మందితో కూడిన పాక్ జట్టు కఠోర శిక్షణ తీసుకొంటోంది. ఈక్రమంలో పెద్ద రాళ్లను మోస్తూ..రాళ్లతో నిండిన పర్వతాన్ని ఎక్కుతున్న వీడియోను ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. రిజ్వాన్, నసీమ్ షా కూడా రాళ్లను మోస్తూ, పర్వతం ఎక్కారు. రెండు వారాల ఈ శిక్షణ సోమవారంతో ముగియనుంది. ప్రపంచ కప్ జూన్‌లో అమెరికా/వెస్టిండీ్‌సలో జరగనుంది.
Updated Date - Apr 07 , 2024 | 03:33 AM