ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గెలిచినంత సంబరం

ABN, Publish Date - Dec 18 , 2024 | 05:05 AM

అక్కడ భారత్‌ మ్యాచ్‌ గెలిచింది లేదు.. కనీసం ఆసీస్‌ స్కోరును కూడా దాటింది లేదు. కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ పట్టరాని సంతోషంతో...

అక్కడ భారత్‌ మ్యాచ్‌ గెలిచింది లేదు.. కనీసం ఆసీస్‌ స్కోరును కూడా దాటింది లేదు. కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే.. ఎట్టి పరిస్థితిలో భారత్‌కు ఫాలోఆన్‌ తప్పదని భావించిన వేళ.. గాబాలో జరిగిన అద్భుతాన్ని వారు నమ్మలేక పోయారు. ఆఖరి వికెట్‌కు ఆకాశ్‌, బుమ్రా క్రీజులో నిలకడను ప్రదర్శిస్తూ ఒక్కో పరుగు జత చేస్తూ వచ్చారు. కమిన్స్‌ ఓవర్‌లో గల్లీ మీదుగా ఆకాశ్‌ కొట్టిన ఫోర్‌తో జట్టు 246 స్కోరుతో ఫాలో ఆన్‌ దాటింది. అటు టెన్షన్‌గా చూస్తున్న గంభీర్‌ ఒక్క ఉదుటున లేచి కోహ్లీకి హైఫైవ్స్‌ ఇవ్వగా.. అటు రోహిత్‌, విరాట్‌ కూడా చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Dec 18 , 2024 | 05:05 AM